ఎంపీ కోమటిరెడ్డి హౌస్ అరెస్ట్.. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులా?
Publish Date:Jun 11, 2020
Advertisement
తెలంగాణలో అధికంగా వస్తున్న కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉదయం 6 గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కరోనా సమయంలో లాక్డౌన్ విధించి ఇళ్ల అద్దెలు చెల్లించవద్దని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు శ్లాబుల పేరుతో ప్రజల నెత్తిన వేలాది రూపాయల బిల్లులు రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇంతింత కరెంటు బిల్లులు ఎలా కడతారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేయడం ఎక్కడి న్యాయమని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/congress-mp-komatireddy-venkat-reddy-house-arrest-25-100118.html





