కేసీఆర్ ప్రభుత్వం నీటి బుడగా? ఎలా?
Publish Date:Jul 14, 2014
Advertisement
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఆ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తోందన్న సంగతి పక్కన పెడితే, అన్నీ సరిగ్గా జరిగితే అయిదేళ్ళు ఆ ప్రభుత్వం అధికారంలో వుండే అవకాశాలు వున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చీటికి మాటికి కేసీఆర్ ప్రభుత్వం అయిదేళ్ళుండే ప్రభుత్వం కాదని స్టేట్‌మెంట్లు ఇస్తూ వుండటం తెలంగాణ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తమకు ముఖ్యమంత్రి కావాలని తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు నానా హడావిడీ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు నిర్దాక్షిణ్యంగా ఛీ కొట్టారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం మీద అపశకునపు మాటలు మాట్లాడుతూ వుండటం తెలంగాణ ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. మొన్నామధ్య గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఇళ్లను కూల్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయేట్టుందని కామెంట్లు చేశారు. తాజాగా కేసీఆర్ తాను ఇచ్చిన హామీలపై మాట తప్పుతున్నారని, అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం నీటి బుడగలాంటిదని కాంగ్రెస్ నాయకుడు, మొన్నీమధ్య ఎన్నికలలో ఓడిపోయిన గండ్ర వెంకట రమణారెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అని నోటికొచ్చిన కామెంట్ చేయడం కాకుండా.. కేసీఆర్ ప్రభుత్వం ఎలా కూలిపోతుందో, పూర్తి మెజారిటీ వున్న కేసీఆర్ ప్రభుత్వం అసలు మెజారిటీ లేకుండా ఎలా పడిపోతుందో కాంగ్రెస్ నాయకులు క్లారిటీగా చెప్పాలి. లేకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏవైనా కుట్రలూ గట్రా చేస్తుంటే అవి కూడా చెప్పాలి. ఇవేవీ చెప్పలేకపోతే నిన్నగాక మొన్న ఏర్పడిన ప్రభుత్వం కూలిపోతుంది... కూలిపోతుంది అని అపశకునపు మాటలు మాట్లాడ్డం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలి.
http://www.teluguone.com/news/content/congress-leaders-comments-on-kcr-government-45-35893.html





