Publish Date:Jan 12, 2025
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంఎల్సీ జీవన్ రెడ్డికి పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. నిజామాబాద్ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డికి మరోసారి ఆ చాన్స్ ఇచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా లేదని అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకుడిగా త్వరలో జరగనున్న నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవల మీడియాతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడుతూ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో జీవన్ రెడ్డి వినా మరో పేరు అసలు పరిశీలనలోనే లేదన్నారు.
వాస్తవానికి జీవన్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చి వరకూ ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అంటే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికే మరోసారి అవకాశం అని అంతా భావించారు. అయితే చివరి నిముషంలో అనూహ్యంగా తెరపైకి నరేందర్ రెడ్డి, ప్రసన్నహరికృష్ణ, వెల్చాల రాజేందర్ రావు, గంగాధర్ పేర్లు తెరపైకి వచ్చాయి. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ కొత్తగా వీరి పేర్లు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో నరేందర్ ఆల్ఫోన్స్ విద్యాసంస్ధల అధినేత కాగా, ప్రసన్నహరికృష్ణ, వెల్చాల రాజేందర్ రావు పార్టీలో సీనియర్ నేతలు, ఇక గంగాధర్ మాజీ డీఎస్పీ. తొలి నుంచీ కాంగ్రెస్ లో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని కాదని వేరే వారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలంచడంపై పార్టీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-keep-aside-jeevan-reddy-for-graduate-25-191237.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.