ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన.. కేసీఆర్ కుర్చీకి ఎసరేనా?

Publish Date:Jun 29, 2023

Advertisement

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. జులై 2వ తేదీ ఖమ్మంలో ఆయన  కాంగ్రెస్ గుటికి చేరనున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు భారీగా ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అందులోభాగంగా ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని 100 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సభ నిర్వహణ పనులను పొంగులేటి అండ్ కో స్వయంగా పర్యవేక్షిస్తోంది. 

అయితే ఈ బహిరంగ సభకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సభకు దాదాపు 5 లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు నాయకగణం ఏర్పాట్లు చేస్తుంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులపై తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిన విషయం విదితమే ఆ క్రమంలో వీరిద్దరు కాంగ్రెస్ గూటికా, కమలం గూటికా అన్న మీమాంశలో చాలా కాలం గడిపేశారు.   అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ కూడా వీరి కోసం తమ తమ పార్టీల తలుపులు బార్లా తెరిచాయి. మా పార్టీలో చేరతారంటే.. మా పార్టీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నాయి.  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్  విజయఢంకా మోగించడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో జోష్ మీద ఉన్న బీజేపీ  డీలా పడగా... హస్తం పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఒకటికి రెండు స్లారు.. పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో వరుస  భేటీలు నిర్వహించారు. దీంతో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమై.. ముహూర్తం ఖరారు అయింది. ఆ క్రమంలో జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచుకోనున్నారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న జిల్లా . అలాంటి జిల్లాలో గత ఏడాది డిసెంబర్‌లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలంగాణ తెలుగుదేశం శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత అంటే ఈ ఏడాది జనవరిలో తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన...  ఇదే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ సైతం విజయవంతమైంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సైతం జులై 2వ తేదీన ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ సైతం గ్రాండ్ సక్సెస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ సభకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు తెలంగాణలోని పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవడానికి వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్న గులాబీ బాస్ కేసీఆర్‌ కుర్చీకి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందనే ఓ చర్చ  తెలంగాణ సమాజంలో హల్‌చల్ చేస్తోంది.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.