ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు.. సంకటంలో ఇండియా కూటమి

Publish Date:Sep 7, 2023

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిథి స్టాలిన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఇచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని భగ్నం చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కూమటి భాగస్వామ్య పక్షంలోని పార్టీకి చెందిన మంత్రి అన్న కారణంతో ఉదయనిథి స్టాలిన్  వ్యాక్యలు సమర్థిస్తే ఒక తంటా.. ఖండిస్తే మరో తంటా అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. పోనీ ఎటువంటి స్పందనా లేకుండా వదిలేద్దామా అంటే అదీ కుదిరే పని కాదు. ఆయన మొత్తంగా హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న భావన ప్రజలలో బలంగా ఏర్పడే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ పార్టీలూ, హిందుత్వ వాదులూ బలంగా ప్రచారం చేస్తున్నారు. అన్నిటికీ మించి సనాతన ధర్మాన్ని కరోనా వంటి మహమ్మారితో పోల్చడం ద్వారా ఉదయనిథి స్టాలిన్  దేశంలోని మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న భావన మెజారిటీ ప్రజలలో వ్యక్తం అవుతున్నది.  

అన్నిటికీ మించి ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ హ్యాట్రిక్ అనుమానం అన్నట్లుగా మారిన బీజేపీ అధికార ఆశలకు ఊపిరులూదిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానిగా మోడీ వైఫల్యాల మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఆ చర్చను పక్కదారి పట్టించడమే కాకుండా హిందుత్వే వచ్చే సార్వత్రిక ఎన్నికల అజెండాగా మార్చేశాయని అంటున్నారు.  ఇక సంఘ్ పరివార్ ఉదయనిథి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ వివాదాన్ని రగులుస్తూనే ఉంటుందని చెబుతున్నారు.  ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ కు ఇప్పటి వరకూ కనిపిస్తున్న సానుకూలత మాయమైపోయి ప్రమాదం కనిపిస్తోందనీ, ఇప్పుడ కాంగ్రెస్ హిందు వ్యతిరేకం కాదన్నది రుజువు చేసుకోవాల్సిన అనివార్యతను తెచ్చి పెట్టిందని అంటున్నారు.

ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఎన్నికల వేళ ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయాచిత బ్రహ్మాస్త్రంగా లభించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బలోపేతానికి కూడా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు గండి కొట్టినట్లేనని చెబుతున్నారు.  ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుంటే విపక్ష పార్టీలు ఇండియా కూటమితో కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఉదయనిథి వ్యాఖ్యలను విస్మరించి డీఎంకే ఉన్న ఇండియా కూటమిలో కొనసాగితే.. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఉనికే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తూ  కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం.. ఇలా ఒకటేమిటి కాంగ్రెస్ సహా ఇండియా భాగస్వామ్య పార్టీలన్నీ సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాయి.

ఉదయనిథి స్టాలిన్ మాటలతో ఏకీభవించడం లేదని ప్రకటించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కీలక నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంతవరకూ స్పందించపోవడాన్ని బీజేపీ ఎత్తి చూపుతూ ఈ విషయంలో గాంధీ ద్వయం వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ సెక్యులరిజం ముసుగులో హిందూత్వకు వ్యతిరేకంగానే పని చేస్తున్నదంటూ హిందూ సంఘాలు విమర్వలు గుప్పిస్తున్నాయి.  దీనిని బట్టే ఉదయనిథి స్టాలిన్ సతానత ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఏ స్థాయిలో ఇరుకున పడేశాయో అర్ధం చేసుకోవచ్చు.

 ఈ విషయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మరెన్నో రోజులు మౌనంగా ఉండే అవకాశం లేదు. వారి మౌనం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చక తప్పదు. సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమ స్టాండ్ ఏమిటన్నది ఎటువంటి శశబిషలకూ తావు లేకుండా సోనియా రాహుల్ లు నోరు విప్పక తప్పని  పరిస్థితి. ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నిస్సందేహంగా బీజేపీ వ్యతిరేక  కూటమి ఐక్యతపై ప్రభావం చూపకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.