వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగ

Publish Date:Aug 13, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగపెట్టేసిందా? పార్టీ నుంచి బహిష్కరించకుండానే ఆయనను ఏకాకిని చేసేసిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కాదు.. స్టార్ క్యాంపెయినర్ కూడా. అయినా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన సమయంలో మునుగోడులో కాంగ్రెస్ ప్రచార సారథ్యం వెంకటరెడ్డిదే అని ఒక ఊరడింపు మాట తప్ప... ఆ తరువాత జరిగిన ఏ విషయంలోనూ, ఏ వ్యవహారంలోనూ వెంకటరెడ్డికి ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. కనీసం సమావేశాలకు కూడా పిలవడం లేదు. మునుగోడు ప్రచార కర్తల జాబితాలో ఆయన పేరు కూడా లేదు. ఎన్నికల సమావేశాలకు పిలవడం అటుంచి కనీసం ప్రచారానికి రమ్మని కూడా అనడం లేదు. ర్యాలీలు, పాదయాత్రలలోనూ ఆయనను దూరంగానే పెడుతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే  కాంగ్రెస్ లో ఉండి కూడా  లేనట్టుగానే ఆయన పరిస్థితి ఉంది. కనీస అవగాహన ఉన్న ఎవరికైనా కాంగ్రెస్ ఆయనకు పొమ్మన లేక పొగపెడుతోందని ఇట్టే అర్ధమైపోతుంది. అలాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇంకా అర్ధం కాలేదని భావించలేం. కానీ ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారు. ఉండి ఊరుకోవడం లేదు. టీపీసీసీ చీఫ్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వాటిని పార్టీ పట్టించుకోవడం లేదని తెలిసినా ఆయన తన ప్రయత్నం తాను మానడం లేదు. సోదరుడి గొంతుకకు వంత పాడుతున్నట్లు ఆయన తీరు ఉందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

అందుకే ఆయన పార్టీలో ఉన్నా బీజేపీ గూటికి చేరిన ఆయన సోదరుడిలాగే కాంగ్రెస్ చూస్తోంది. దీంతో అనివార్యంగా ఎవరూ పిలవకపోయినా, ఎవరూ ఆహ్వానించకపోయినా... ఆ విషయాన్ని దాచి పెట్టి మునుగోడు ఉప ఎన్నికతో తనకు సంబంధం లేదనీ, తానక్కడకు ప్రచరానికి వెళ్లబోవడం లేదనీ గంభీరంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై అనుచిత విమర్శలు చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తనను విమర్శించిన వారినీ, విమర్శించేలా చేసిన వారిని వదిలిపెట్టనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

వాళ్ల విషయం రాష్ట్ర కాంగ్రెస్ తో కాదనీ, ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోనే తేల్చుకుంటాననీ చెబుతున్నారు. అయితే ఆయన మాటలను కాంగ్రెస్ వర్గీయులే ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఉండీ లేనట్టేనని, ఆయన తీరు పట్ల హైకమాండ్ కూడా విసిగిపోయిందనీ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ కాదుకదా, కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అప్పాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టమేనంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ ఎప్పుడో పరిగణనలోనికి తీసుకోవడం మానేసిందని అంటున్నారు. పార్టీ నుంచి కోమటిరెడ్డిని ప్రత్యేకంగా బహిష్కరించడం అంటూ ఉండదనీ, కానీ ఆయనకు కనీస గుర్తింపు కూడా లేని చోట ఉండలేని పరిస్థితి కల్పించడమే పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నీ తెలిసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని అడ్డు పెట్టుకుని ఉండటానికి కారణం.. పార్టీలో ఉంటూనే తన సోదరుడికి సాధ్యమైనంత మేలు చేసి ఆ తరువాత కమలం గూటికి చేరాలన్న వ్యూహమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.