Publish Date:Aug 31, 2026
తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.
అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.
పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.
[Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-high-command-softcorner-on-konda-surekha-25-230276.html
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.