అధిష్టానం ఆశలన్నీ తెలంగాణ పైనే!

Publish Date:Jul 7, 2025

Advertisement

తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు  సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ..  స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు. సామాజిక న్యాయ సదస్సు పేరిట జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.   ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్  చేస్తూ ఘాటైన  విమర్శలు చేశారు.  అలాగే..  పార్టీలో అసమ్మతి మొదలు పదవుల భర్తీ వరకు అనేక విషయాలను సమీక్షించి రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు.ఈ మొత్తం కసరత్తును చూస్తే..  స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు.

అలాగే, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోందో కూడా వేరే చెప్పనవసరం లేదంటున్నారు. ఆ విషయం కూడా కేసీ వేణుగోపాల్  స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను రోల్  మోడల్ గా భావిస్తోందని స్పష్టంగానే చెప్పారు. నిజానికి ఇప్పుడు వేణుగోపాల్ చెప్పడం కాదు..  ఎప్పుడోనే  పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ కులగణన విషయంగా  తెలంగాణ మోడల్   ది బెస్ట్  అని ప్రకటించారు.  అంతే కాకుండా..  జాతీయ స్థాయిలో జనగణనతో పాటుగా చేపట్టే కులగణనకు తెలంగాణ మోడల్ ఫాలో కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే..  తాజాగా సామాజిక న్యాయ సదస్సు వేదిక నుంచి చేసిన ప్రసంగంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా కులగణన చేయించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబు నిచ్చారు. అంతే కాదు.. జనాభా దామాషా  ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందనీ,  ఈ పోరాటంలో రాష్ట్ర ప్రజలు కూడా తమకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు.  సో...కాంగ్రెస్ అధిష్టానం కులగణనకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో..  తెలంగాణ స్థానిక ఎన్నికలకూ  అంతే ప్రాధన్యత ఇస్తోందని, అంత సీరియస్ గా తీసుకుంటోందని అంటున్నారు.

అందుకే.. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్  అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తోందని అంటున్నారు. అయితే, నిర్ణయం కేంద్రం కోర్టులో ఉన్నదున.. ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.అయినా.. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం  కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు  న్యాయనిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

అయితే.. ఒక్క బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ వాగ్దానంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? లేక అమలు కాని  హామీలు, గ్యారెంటీలు, రైతులు, నిరుద్యోగ యువకులు, మహిళలు ఇలా విభిన్న వర్గాల ప్రజల్లో క్షణ క్షణం పెరుగుతున్న అసంతృప్తి, పార్టీలో పెరుగుతున్న అసమ్మతి వంటి ప్రతికూల అంశాలు కూడా స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం హోప్స్ అన్నీ తెలంగాణ పైనే పెట్టుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.