తెలంగాణలో కాంగ్రెస్ ‘ఎత్తర జెండా!’

Publish Date:Jun 5, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అధికారానికి దూరమైన కాంగ్రెస్ తన పూర్వ వైభవం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తోంది. మొన్నమొన్నటి  వరకూ తమదే గెలుపు అని చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ తన బలాన్ని మరో సారి ప్రదర్శించే పనిలో ఉంది.  కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి పార్టీలు ఇంత వరకూ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. జూన్ 2వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకటనతో తెలంగాణ సహా రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టమైంది. 

ఇటీవల ముగిసిన కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అధికార పార్టీ అధినేతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఫలితాలను ఇవ్వడంతో తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాన్నే అవలంబిచాలని భావిస్తోంది.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తోంది.  కర్నాటక, తెలంగాణలో ఉన్న సారూప్యతలపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ ఇక్కడి ముస్లిం ఓట్లపై గురిపెట్టింది. హిజాబ్, టిప్పు సుల్తాన్ వంటి అంశాలు ఇక్కడ లేకపోవడంతో రాజకీయ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దృష్టి పెడుతోంది. మరో వైపు ముఖ్యమంత్రి పదవి అల్ప సంఖ్యాక వర్గాలకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను తొమ్మిదేళ్లుగా చూస్తున్న తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా కనిపించబోతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయం, అమరుల స్థూపం వంటి నిర్మాణాలు, దళిత బంధు వంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గ్రాఫ్ ని మరీ పతనం కాకుండా కాపాడినా కాంగ్రెస్ గెలుపును ఆపలేవని తాజా సర్వేలు చేబుతున్నాయి.  మే నెలలో ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.  

కాంగ్రెస్ వర్గ విభేదాలు పక్కన పెట్టి పని చేస్తే రానున్న ఎన్నికలలో 41శాతం ఓటు షేరును సాధించి 68 సీట్లు గెలవగలదని ఆ సర్వే తేల్చింది.  37శాతం ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ 35 సీ్టలు, పది శాతం ఓట్లతో  బీజేపీ 8 సీట్లు, 3శాతం ఓట్లతో ఎంఐఎం 6 సీట్లను తమ ఖాతాలో వేసుకోనుండగా, ఒకరిద్దరు ఇతరులు విజయం సాధిస్తారని ఈ సర్వే తేటతెల్లం చేసింది. 

తొమ్మదిన్నరేళ్లు అధికారంలో ఉండడం, కింది స్థాయి నాయకులపై ప్రజల్లో అసంతృప్తి ఉండటం, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వంటి కారణాలు కేసీఆర్ కు సమస్యగా మారగా, వరుస తప్పిదాలు, నాయకత్వ లోపం, స్పష్టమైన అభివృద్ధి అజెండా లేకపోవడం, కేసుల విషయంలో కప్పదాట్లు బీజేపీ పాలిట శాపంగా మారాయి.  అభ్యుదయ వాదులు, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు బీజేపీ మాటలపై, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలపై నమ్మకం పోయింది.  ఈ రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.  ప్రస్తుతం తెలంగాణలోని తటస్థ నాయకులకు కాంగ్రెస్ ఏకైక ఎంపికగా మారిందనడంలో ఏ మాత్రం సంశయం అక్కర్లేదు. 

By
en-us Political News

  
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.