Publish Date:Mar 22, 2026
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. దశాబ్దాలుగా తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఆయన రంజాన్ ప్రార్థనల్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొనడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. అయితే ఆ బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం.
వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపారని, సముచిత గౌరవంతో పాటు భవిష్యత్తులో కీలక పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్ లో చేరతానంటే భుజాల మీద మోసుకుని మరీ తీసుకువెడతానని బీఆర్ఎస్ నేత ఒకరు బాహాటంగానే చెప్పడం ఇక్కడ గమనార్హం.
జీవన్ రెడ్డి అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సీనియర్లను కాపాడుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రి శ్రీధర్ బాబు ఇతర నేతలు శనివారం (మార్చి 21) జీవన్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ వీడవద్దనీ, ఏ సమస్యైనా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నచ్చ చెప్పారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఇసుమంతైనా మెత్తబడలేదు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, ఆయన వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడం వంటి పరిణామాలు జీవన్ రెడ్డి అసంతృప్తికి, ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. అలాగే అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం సంజయ్ కుమార్ కు అనుకూలంగా ఉండటం, ప్రభుత్వం కూడా ఆయనకే ప్రాధాన్యత ఇస్తుండటం జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ లో కొనసాగేది లేదన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. అదలా ఉంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాల సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-futile-conciliations-25-215937.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.