ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో హస్తం పార్టీ?

Publish Date:Apr 21, 2025

Advertisement

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే  కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు..   వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు.  ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ  ఎప్పుడు  ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా..  రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ  దాచుకోలేదు. నిజానికి  రాహుల్ గాంధీ బీజీపీ, మోదీలను ఎక్కువ వ్యతిరేకిస్తారా? ఆర్ఎస్ఎస్ ను ఎక్కువ వ్యతిరేకిస్తారా అంటే అనుమానం లేకుండా  ఆర్ఎస్ఎస్  అనే సమాధానమే వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన బీజేపీ,ఆర్ఎస్ఎస్ లతో పాటుగా దేశం పై కూడా  యుద్ధం ప్రకటించారు. అందుకే, ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా.. ఎప్పుడు వచ్చినా  రాహుల్ గాంధీ అగ్గి మీద గుగ్గిలం అవడం చూస్తున్నాము. 

కాగా  కొద్ది రోజుల కిందట, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సందీప్ దీక్షిత్ తో జరిపిన  సంభాషణలోనూ రాహుల్  గాంధీ అదే చెప్పారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న వ్యతిరేకత తమ జీన్స్ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. అవును.. మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కలలో కనిపిస్తే..  మీరు ఆయన్ని ఏమి అడుగుతారు? అని సందీప్ దీక్షిత్  అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ, తాను అడిగే ప్రశ్నతో పాటుగా నెహ్రూ చెప్పే సమాధానం కూడా చెప్పారు. 
 మా ముత్తాత నెహ్రూ కనిపిస్తే.. నేను Tell me one thing that I never ever do  అంటే నేను జీవితంలో ఎప్పుడూ, ఎప్పటికీ ఏది చేయకూడదో చెప్పమని అడుగుతానని  సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఆ వెంటనే,తన ప్రశ్నకు  నెహ్రూ .. ఇచ్చిన సమాధానం కూడా చెప్పనా?  అంటూ  Never compromise with RSS   ఆర్ఎస్ఎస్ తో ఎప్పుడు రాజీ పడద్దు  అని నెహ్రూ చెప్పారని రాహుల్ చెప్పారు. 

ఈ సభాషణను గమనిస్తే, రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత వెనుక జన్మజన్మల వైరం ఏదో ఉందనిపిస్తుంది. అలాగే.. ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏస్థాయిలో వుందో,  అ ద్వేషం మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. 

 అయితే.. రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల ఇంత వ్యతిరేకత, ద్వేషం ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే.  అ యినా.. చిత్రంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజాన్ మాత్రం..  కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని  సూచించారు. అవును..  చేవెళ్ల, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ఆమె, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని,వారి పద్దతిలో పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

 అలాగే,ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో కూడా ఆమె వివరించారు. ఆర్ఎస్ఎస్  సభ్యులు మనిషి మనిషినీ కలుస్తారు.  కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా అదే తరహాలో మనిషి మనిషినీ కలిసి ప్రభుత్వ పథకాలను, వాటి ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేవలం మీడియానో, సోషల్‌ మీడియానో నమ్ముకుంటే సరిపోదని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ముఖాముఖి  మాట్లాడాలని,  అప్పుడే ప్రజలు నాయకులకు, పార్టీకి, ప్రభుత్వానికి దగ్గరవుతారని చెప్పారు. 

అయితే..  ఈ సూచనను, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎలా తీసుకుంటారు? ఎంత వరకు అమలు చేస్తారు? అనేది పక్కన పెడితే.. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలనే మీనాక్షి నటరాజన్ సూచనను రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఓవంక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోవర్టులను గుర్తించి  ఏరివేయాలని అంటుంటే, మీనాక్షి నటరాజన్  ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలు, నాయకులకు చేసిన సూచనను ఎలా తీసుకోవాలని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. 
అయితే..  పార్టీ ముఖ్యనాయకులు మాత్రం  ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేందుకు రాహుల్ గాంధీ ఒక్క నాటికీ అంగీకరించరని అంటున్నారు. అలాగే.. మీనాక్షి నటరాజన్  అనాలోచితంగా ఈ సూచన చేసి ఉండవచ్చునని అంటున్నారు. అన్నిటిని మించి,ఆర్ఎస్ఎస్  కార్యకర్తల  కమిట్మెంట్ తో పనిచేయడం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమని, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే, నటరాజన్ సూచనలను, అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.