టీడీపీ వైపు.. కాంగ్రెస్ నేతల చూపు
Publish Date:Aug 24, 2018
Advertisement
విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. గత ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవని కాంగ్రెస్ ఈ సారి కాస్త ఓటు శాతాన్ని అయినా పెంచుకోవాలని చూస్తోంది.. ఈ నాలుగేళ్లలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశ కానీ, ఆలోచన కానీ ఎవరికీ రాలేదు.. కానీ ఈమధ్య పరిస్థితులు మారిపోయాయి.. విభజన హామీల విషయంలో బీజేపీ మీద ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.. ఈ ఆగ్రహాన్ని కాంగ్రెస్ తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.. ప్రత్యేకహోదా ఇస్తామని, ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తోంది.. మరోవైపు సీనియర్స్ ని పార్టీలోకి తీసుకురావడానికి కూడా ప్రయతిస్తోంది.. ఇప్పటికే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చారు.. మరోవైపు రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.. ఇలా నాయకులు చేరటంతో ఇక ఏపీలో కాంగ్రెస్ కి మంచి రోజులు మొదలయ్యాయి.. కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకుంటుంది అనుకున్నారు.. కానీ అంచనాలు తారుమారు అవుతున్నాయి. నాయకుల చేరికతో కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకుంటే, ఉన్న నాయకులు వేరే పార్టీల వైపు చూస్తున్నారు.. పలువురు కాంగ్రెస్ నేతలు టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్దపడినట్టు తెలుస్తోంది.. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తాజాగా సీఎం చంద్రబాబుతో ఉండవల్లిలో భేటీ అయ్యారు.. ఆయన చేరిక పట్ల చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే స్థానిక నేతల నుండి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో, ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో పార్టీ అధినాయకత్వం చర్చలు జరుపుతోంది.. ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరిక అంశం త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మరోనేత మాజీ మంత్రి కొండ్రు మురళి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే కొండ్రు మురళి చేరికను, టీడీపీ సీనియర్ నేత ప్రతిభా భారతి వ్యతిరేకిస్తున్నారు.. మురళి రాజాం టిక్కెట్టును ఆశిస్తుండటంతో ఆమె ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. దీంతో ఈ విషయంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది.. అయితే వీరే కాదు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీలో చేరటానికి ఆసక్తిచూపుతున్నట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/congress-ex-mlas-likely-to-join-tdp-39-83237.html





