కాంగ్రెస్ డౌన్ బట్ నాట్ అవుట్

Publish Date:Jun 17, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ముఠాల కుమ్ములాటలు కొత్త విషయం కాదు, విశేషమూ కాదు. అదొక మాములు విషయం. ఒక సహాజ లక్షణం.నిత్య క్రతువు.అందుకే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు, ముఠాల కుమ్ములాటలు లేకపోతే ఆశ్చర్యపోవాలిగానీ, లేదంటే అందులో ఆశ్చర్య పోవలసిన విషయం, విశేషం మరొకటి ఉందని అంటారు. నిజం ఒక్క, తెలంగాణలోనే కాదు దేశం అంతటా, అంతే. అదే పరిస్థితి.

 అయితే, ఇప్పుడు గమ్మత్తుగా దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒకటిగా పోరాడుతున్నారు. నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విచారించదాన్ని వ్యతిరెకిస్తూ దేశ వ్యాప్తంగా   ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు అంతా ఒకటిగా ఎక్కడ లేని ఐక్యతా  ప్రదర్శిస్తున్నారు.నిజంగా, ఇదొక అపూర్వ చిత్రం.   ఇక తెలంగాణ విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీలో  జోష్ పెరిగింది. అదే సమయంలో అసమ్మతి కార్యక్రమాలూ జోరందుకున్నాయి.

ఒకదాని కొకటి  సమాంతరంగా సాగడంతో, రైలు పట్టాల్లా ఒకదాని కొకటి కలవడం లేదు. అడుగు ముందుకు పడడం లేదు. ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నిలిచి పోయింది. ఇదో ఎవరో చేసిన వ్యాఖ్యానం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా వ్యక్త పరుస్తున్న ఆవేదన.  నిజానికి, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం ఒకటికి నాలుగు సార్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే, పరిస్థితి ఏమిటో వేరే వివరించవలసిన అవసరం లేదు. అయినా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నా, తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం అయితే ఇంతవరకు లభించలేదు.  


అందుకే రేవంత్ రెడ్డి  సారథ్యంలో నిర్వహించిన ఆందోళనలు అన్నీ సక్సెస్ అయినా, అదే సమయంలో పార్టీలో అసమ్మతి కట్లు విప్పుకోవడంతో, సక్సెస్ వెంట ఫెయిల్యూర్ వెంటాడుతూ వచ్చింది. చివరకు పరిస్థితి  బేరీజు వేసుకుంటే సున్నకు సున్నా .. హళ్లికి హళ్లి అన్నట్లుగానే ఉందని పార్టీ పరిశీలకులే అంటున్నారు. కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు  రాష్ట్ర స్థాయి నేతలఫై విశ్వాసం కోల్పోయారు. వీళ్ళంతే, మారరు’ అనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది.
అయితే ఇప్పుడు  సోనియా,రాహుల్‌ గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ.. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో ‘ఏ టూ జెడ్’ అన్ని  గ్రూపుల నాయకులూ పాల్గొన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఇంత మంది నాయకులు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య  ఇంత సయోధ్య  ఉందా? అనే అనుమానం వచ్చే విధంగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

నాయకులే కాదు కార్యకర్తలు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ డౌన్ బట్ నాట్ అవుట్ అనే విశ్వాసాన్ని కలిగించింది. అలాగే ఇక్కడ మరో విషయం కూడా వెలుగు చూసిందని పరిశీలకులు అంటున్నారు. మాకు  మాకు మధ్య వెయ్యున్నా,గాంధీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, కురు పాండవుల్లా మేమంతా ఒకటవుతామనే సందేశాన్ని కాంగ్రెస్ నాయకులు జనంలోకి పంపారని పరిశీలకులు అంటున్నారు.  అయితే, ఈడీ విచారణలు దేశంలో చాలా మంది మీద జరుగుతూనే ఉంటాయి.

నిజానికి కొద్ది రోజుల ముందు ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, దళిత నేత మల్లికార్జున ఖర్గేను ఈడీ విచారించింది. ఆయన మందీ మార్బలం లేకుండా ఈడీ కార్యాలయానికి వెళ్లారు, ఈడీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి హుందాగా వచ్చారు. అదే విధంగా రాహుల్ గాంధి, సోనియా గాంధి కూడా హుందాగా విచారణకు హరరైతే, పార్టీ గౌరవం పెరిగేదని సమస్య ఉండేది కాదని, అందుకు విరుద్ధంగా దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయడం వలన, పార్టీ ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉందని పార్టీలో కొందరు గుసగుసలు పోతున్నారు. ఈడీ విచారణ వలన పార్టీలో వచ్చిన ఐక్యత  ఎంత కాలం ఉంటుందో తెలియదు, కానీ, పడిన మచ్చ మాత్రం అంత త్వరగా పోదని అంటున్నారు.

 అయితే, గతంలో ఎమర్జెన్సీ అనంతరం షా కమిషన్ విచారణ అధారంగా ఇందిరా గాంధీని  మొరార్జీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పుడు కూడా ఇలాగే, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అరెస్ట్’కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసింది.  ప్రజలు ఆమెకు అండగా నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. అదే సమయంలో జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తలెత్తి మొరార్జీ ప్రభుత్వం కూలి పోయింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇందిరా గాంధీ  మళ్ళీ ప్రధాని అయ్యారు. ఇప్పడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందనే గంపెడు ఆశతోనే కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చిందని అంటున్నారు. అయితే, అది 50 ఏళ్ల నాటి ముచ్చట, అప్పుడు టీవీ  లేదు ఇప్పుడు టీవీ కాదు, ప్రతి చేతిలో ఇంటర్నెట్ వుంది.సో.. అప్పుడు జరిగిందే ఇప్పడు జరగాలంటే కాలం వెనక్కి వెళ్ళడం ఒక్కే మార్గం ..అది జరగదు..ఇది మాత్రం జరుగుతుందా.. ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు ..

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.