తెలంగాణలో నెక్ట్స్ సీఎం సీతక్కే?!

Publish Date:May 26, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంగా సీతక్కే అవుతారని ఆ పార్టీలో మెజారిటీ భావిస్తోంది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులే కారణమని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.

ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి.. కాషాయం జెండా రెపరెపలాడించాలని కేంద్ర పెద్దల మార్గదర్శనంలో... టీ బీజేపీ నేతలూ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అదే విధంగా  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ  సైతం ప్రజల్లోకి నేరుగా దూసుకుపోతోంది. ఆయన అధ్యక్షతన జరుగుతోన్న సభలు, సమావేశాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్,  ఆయన ఫ్యామిలీపై నేరుగా విమర్శలు గుప్పించ గల సత్తా తెలంగాణలో ఎవరికైనా ఉందా? అంటే అది రేవంత్ ఒక్కరే అన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతోంది.

 అదీ కాకుండా  రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్లు అన్నట్లుగా మారిపోయింది. అలాంటి పార్టీ ఇప్పుడు జవసత్వాలు పుంజుకుని  బీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా పోటీగా నిలిచిందంటే అందుకు కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వమేనని పార్టీ అధిష్ఠానం సైతం నమ్ముతోంది. వాస్తవానికి   తెలంగాణ తెచ్చింది  తానేనని కేసీఆర్ చెప్పుకుంటున్నా.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మాత్రం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  అన్న విషయాన్ని ప్రజలకు చేరువ చేయలేకపోవడమే అప్పటి పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పిదమని అప్పట్లోనే కాదు ఇప్పుడూ విమర్శలు ఉన్నాయి.  రాష్ట్రంలో కాంగ్రెస్ అన్ని విధాలుగా దిగజారిపోయిన కాంగ్రెస్ ను తెలుగుదేశం పార్టీ వీడి వచ్చిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు సాగించారు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు కూడా.

అయితే వేరే పార్టీ నుంచి వ్యక్తికి పీసీసీ పగ్గాలు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని ‘సీనియర్లు’ ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఒక దశలో ఆయన రాజీనామాకు కూడా సిద్ధమయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అధిష్ఠానం రేవంత్ కు అనుకూలంగా నిలబడటంతో రేవంత్ నిలదొక్కుకున్నారు. పార్టీని నిలబెట్టారు. ఈ క్రమంలోనే కర్నాటక ఫలితాల తరువాత ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. రేవంత్ దూకుడును నియంత్రించుకున్నారు. సీనియర్లు ధిక్కారాన్ని తగ్గించుకున్నారు. ముందు రాష్ట్రంలో అధికారం ఆ తరువాతే అధికారం, పెత్తనం గురించి ఆలోచిద్దాం అన్న ధోరణి కనబరుస్తున్నారు.

కర్నాటకలో డీకే , సిద్ధూ ఐక్యంగా పార్టీని విజయపథంలో నడిపించిన తీరును అనుకరించాలని నిర్ణయించుకున్నారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నేత ఎవరన్న దానిపై పార్టీలో జరిగిన చర్చలో సీతక్క పేరు తెరమీదకు వచ్చిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క  మావోయిస్టుగా ఉన్నా  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. అనంతరం  తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రాష్ట్ర విభజన.. అనంతరం చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ గూటికి చేరారు.   ఆ కొద్ది రోజులకే రేవంత్‌కి పీసీసీ చీఫ్ కట్టబెట్టడంపై అప్పటికే పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు.. అంతా అలిగి  ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతూ రేవంత్ నాయకత్వానికి అండదండగా మద్దతుగా నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినా రేవంత్ విషయంలో వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రెస్ పాత కాపుల నుంచి సీతక్కకు ఎదురు కాలేదు. ఎందుకంటే  గతంలో ఆమె మావోయిస్టుగా ఉన్నప్పడూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైతం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు.

అలాగే కరోనా సమయంలో ఆమె ప్రజలమధ్యే నిత్యం ఉంటూ.. వారి కోసం అహర్నిశలు కష్టపడ్డారు....  ఎవరూ బయటకు అడుగుపెట్టేందుకు కూడా సాహసం చేయని ఆ సమయంలో నెత్తిన ఆహార పదార్థాలు, ఔషదాలు గంప పెట్టుకుని కొండల్లో కోనల్లో ఉంటున్న గిరిజనులకు అందజేయడానికి మైళ్లకు మైళ్లు ఒక్కర్తే నడిచి వెళ్లారు. ఇప్పుడూ ఆమె జనం కష్ట నష్టాలకు వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుంటారు. గత ఏడాది సంభవించిన భారీ వరదల సమయంలో వరద బాధితులను ఆదుకోవడానికి ఎంతో సాహసోపేతంగా పడవపై వరద నీటిలో బాధితుల వద్దకు వెళ్లిన సందర్భాలున్నాయి.  అంతే కాదు వాదాలకు, వివాదాలతో సంబంధం లేకుండా జనం మధ్యే ఉండే ఆమె పార్టీలో అందరికీ అభిమానపాత్రురాలే అంటారు. ఈ నేపథ్యంలోనే  2023 ఏడాది చివర జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి.. అత్యధిక స్థానాలను గెలుచుకొంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీతక్క పేరు పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.