Publish Date:Jul 24, 2026
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఓ కాంగ్రెస్ నేత బర్త్ డే గిఫ్ట్ గా ఓ వినూత్న గిఫ్ట్ పంపి సంచలనం సృష్టించారు. కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 (శుక్రవారం) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు.
అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు. ఈ విషయంపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మెట్టు సాయి కుమార్.. ఇది కేటీఆర్‌కు మా బర్త్‌డే గిఫ్ట్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం విలువ తెలుసుకోవాలనే కేటీఆర్ కు ఈ కానుక పంపినట్లు చెప్పారు.
ఈ పాతిక కిలోలతో సరిపెట్టేయడం లేదనీ, అవసరమైతే.. ప్రతి నెలా ఈ రేషన్ ను కేటీఆర్ కు పంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. దేశంలో ప్రజలకు సన్నబి య్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం చేరుతోందని పేర్కొన్నారు.
ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే అది పండగ రోజు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతిరోజూ పండగేనని సాయికుమార్ చెప్పారు. మొత్తం మీద సాయికుమార్ కేటీఆర్ కు పంపిన ఈ బర్త్ డే గిఫ్ట్ రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.
25kgs, sannabiyyam, rapido, telanganabhawan, Mettu Saikumar
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-birthday-gift-to-ktr-25-227000.html
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.