కోమటి రెడ్డి పై వేటు ?

Publish Date:Feb 15, 2023

Advertisement

బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం మినహా మరో మార్గం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల్ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే తెర దించారు. రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన, శంషాబాద్‌ విమానాశ్రయంలో కాలు పెడుతూనే, బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. నిజానికి, విమానాశ్రయంలోనే, ఆయన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావీద్‌, బోసురాజు, వేణుగోపాల్‌ తదితరులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా  కోమటి రెడ్డి   వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావు.ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదు అంటూ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఠాక్రేకు వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సర్వేలు చూసి హంగ్‌ వస్తుందని చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. 

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఠాక్రే  కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. వీడియోలు చూశాక మాట్లాడతా. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం. వరంగల్‌లో రాహుల్‌ చెప్పిన విషయాలకు పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పారు. మరోవంక కోమటి రెడ్డికి  ‘బయటి’ దారి చూపించేందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్న, పీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి వర్గం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా  కత్తులు దూశారు.  కోమటి రెడ్డి వెంకట రెడ్డిని పార్టీ నుంచి .. అని బహిరంగ వేదిక నుంచి తీవ్ర  పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్‌, మరికొందరు నాయకులతో పాటుగా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు కూడా కోమటిరెడ్డిని తప్పు పడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగానే వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తో కలవాల్సిన పరిస్థితి రాదని.. కోమటిరెడ్డివి వ్యక్తిగత వ్యాఖ్యలన్న వాదన వినిపిస్తున్నారు.  శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి నేరుగానే తమ అభిప్రాయం చెప్పారు. ఇతర నేతలు గుంభనంగా ఉంటున్నారు. 

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరంగల్ లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పడు కోమటి రెడ్డి అందుకు  విరుద్ధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అంటూ బీజేపే చేస్తున్న ప్రచారానికి వంతపాడే వంతపాడే విధంగా  చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ తీసుకుందని అంటున్నారు. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ కాంగ్రెస్ క్రమ శిక్షణా సంఘం ఆయనకు షో కాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ కమిటీల్లో ఎక్కడా ఆయనకు స్థానం కలిపించలేదు. ఇక ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు.

అయితే, అదే జరిగితే  రోగి కోరింది ... వైద్యుడు ఇచ్చింది ఒకటే ... అన్నట్లుగా అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ కావాలనే కోమటి రెడ్డి పార్టీ క్రమ శిక్షణ తప్పి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నాయి. అందుకే, పార్టీ అధిష్టానం తటపటాయిస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.