సంక్షోభంలో యుపిఎ సర్కార్‌

Publish Date:Sep 21, 2012

Advertisement

అనుకున్నంతా జరిగింది....! ఆడ్డగోలు నిర్ణయాలతో ప్రజాజీవనాన్ని కష్టాల్లోకి యుపిఎ సర్కార్‌ నెట్టేస్తోందంటూ కళ్ళెర్రజేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్‌కు తన మద్దతు పూర్తిగా ఉపసంహరించుకుంది. డీజిల్‌ ధరను బాగా పెంచడంతో బాటు భారత్‌ భావిప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ ఎఫ్‌డిఐకి అనుమతి ఇవ్వడంపట్ల మమత మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుడిని మరిన్ని సమస్యలకు గురి చేస్తాయనీ, కాబట్టి ఎఫ్‌డిఐకి అనుమతి ఇచ్చే విషయాన్ని పూనరాలోచించి తక్షణమే ఆ నిర్ణయాలను రద్దు చేసుకోవాలంటూ మమత హెచ్చరించింది. భాగస్వామ్య పార్టీలు హఠం చేసినప్పుడ్‌ల్లా నిర్ణయలు మార్చుకోటే పరసతి పోతుందనుకున్న సర్కార్‌ తన నిర్ణయానికే కట్టుబడిరది. అంతేకాకుండా పార్లమెంటులో తృణమూల్‌కు ఉన్న బలం 19 మంది ఎంపిలు కాగా, వీరు వైదొలగినా తమకు 307 మంది ఎంపిల బలం ఉంటుంది కాబట్టి తమ సర్కార్‌ కొచ్చిన ఇబ్బందేంలేదని యుపిఎ భరోసాగా ఉంది. నిజానికి 276 మంది ఎంపిలు కాంగ్రెస్‌ బలంకాగా, ఎస్పీ, బిఎస్పీ, జనతాదళ్‌ సెక్యులర్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలు బయట నుంచి ఇస్తున్న మద్దతుతో ఆ బలం 307 అవుతుంది. ఇది అధికారంలో కొనసాగేందుకు అవసమైన ఎంపీల సంఖ్యకంటే 35 ఎక్కువ. కాబట్టి తమ సర్కార్‌కు ఢోకాలేదంటూ కాంగ్రెస్‌ నేతలు పైకి చెబ్తున్నా రాజకీయ చదరంగంలో అద్భుతంగా పావులు కదపగలిగే మేధాశక్తి ఉన్న మమత మళ్ళీ ఏం ఎత్తులు వేస్తుందో అనుకుంటూ భయంభయంగానే ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ నేతల భయాలను నిజం చేస్తున్నట్లుగా` మమతా బెనర్జీ ఇప్పటికే యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరో సంవత్సరకాలంలో ఎన్నికలు ఎదుర్కోవలసి ఉన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌ తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు మద్దతు పలికితే అందుకు పరిహారం వచ్చే ఎన్నికల్లో మనం చెల్లించుకోవలసి వస్తుందంటూ మమత హెచ్చరిస్తున్నారట ! ఇది నిజమేనని అంగీకరించిన ఇతర భాగస్వామ్య పక్షాలు మమతతో చేతులుకలిపి మద్దతు ఉపసంహరణ దిశగా ఆలోచనలు సారిస్తున్నట్లు  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చినా తమకే లాభం అనుకుంటూ బిజిపి పక్షాలు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి !

 

By
en-us Political News

  
అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు.
కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఫ్లోర్ లీడర్ సతీషన్, సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. అధిష్ఠానం మొగ్గు సతీషన్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం ఆశీస్సులతో పాటు సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి వారి మద్దతు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రధానంగా పేదలు, మహిళలు, రైతులు, యువతలకు ప్రయోజనం చూకూర్చే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న  ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. 
 మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిపై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యాయి.
గత ఏప్రిల్ నెలలో మహరాష్ట్ర నుంచి తెలంగాణలో ఎంటరై అయి ఇద్దరిని చంపేసిన గజరాజు ఉదంతం తెలిసిందే. తాజాగా  ప్రస్తుతం మరో  ఏనుగుల గుంపు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని ఆటవిశాఖ అధికారులు చాటింపు వేశారు.
Publish Date:May 23, 2023
If AL Basham were alive today, he would have written a book with this title. In these turbulent times, when the very existence of democracy, secularism...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఏ కారణం చెప్పినా ఆయన బీహార్ పర్యటన మాత్రం కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులకు ఎటువంటి సత్ఫలితాలూ రాలేదు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బులంద్‌షెహ‌ర్ లో దేవేంద్రి అనే మ‌హిళకి పాము క‌రిస్తే ఆమె భ‌ర్త ఏకంగా పేడ‌గుట్ట కింద ప‌డుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బ‌య‌ట‌ప‌డి బ‌తుకుతుంద‌ని!
మాథ్యూప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు
ఒక‌రిని అన్న‌పుడు తామూ ప‌డాలిగ‌దా!  బిజెపికీ ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. గ‌తంలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధా నిగా వున్న‌పుడు ఆయ‌న్ను సోనియా మాట జ‌వ‌దాట‌డ‌ని, కాంగ్రెస్ స్టాంప్ ప్ర‌ధాని అంటూ  తోచిన‌ట్టు కామెంట్లు చేసిన విప‌క్షాల మాట ఇపుడు బిజెపి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ముర్మీ విష‌యంలో విన‌వ‌స్తుంటే ఇబ్బం దిగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.