ఆజాద్‌కు సమస్యలతో స్వాగతం పలకనున్న నేతలు
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు సమస్యలతో స్వాగతం పలికేందుకు నేతలు రెడీ అయ్యారు. శనివారం సమన్వయం కమిటీ సమావేశంలో పాల్గొననున్న ఆజాద్... రేపు పూర్తిగా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఆయా అంశాలపై విజ్ఞప్తులు, విమర్శలు, ఆరోపణలు ఆజాద్ ముందుంచేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సమన్వయ కమిటీ ఏర్పాటైన తర్వాత రెండోసారి జరగనున్న సమావేశం కోసం ఆజాద్ శనివారం హైదరాబాద్ రానున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఆయన రాష్ట్రంలో రెండు రోజులు మకాం వేసి పార్టీ, ప్రభుత్వంలోని పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమావేశం తరువాత రాష్ట్ర రాజకీయాలు ప్రత్యేకించి పార్టీలో పరిస్థితులు చక్కబడకపోగా మరింత ముదురుతున్నాయి....
ఈ సారి రాష్ట్రానికి రానున్న ఆజాద్‌కు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కొద్దికాలంగా స్తబ్ధుగా వున్నారనుకున్న టీ కాంగ్రెస్ ఎంపీలు మళ్ళీ గళం విప్పడం ప్రారంభించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపైనా నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీఆర్పీ వారికి స్థానం కల్పించే విషయంలో కాంగ్రెస్ కలహాల కొలిమి మరింత రాజుకుంది. అవకాశం దక్కని అనేకమంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక శంకర్రావును మంత్రివర్గం నుండి తొలగించడం ఆయనకు మద్దుతుగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాజీవ్ యువకిరణాలు సహా పలు పథకాలపై అక్కడాడక్కడా విమర్శలు వస్తూనే వున్నాయి. మరోవైపు ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలపైనా వాదనలు విన్పించేందుకు , గళం విప్పేందుకు అన్ని స్థాయిలోని నేతలు సిద్ధం అవుతున్నారు.
http://www.teluguone.com/news/content/congress-24-11098.html





