జగన్ తీరుతో పాలన అస్తవ్యస్తం.. భవిష్యత్ పై వైసీపీ నేతల అయోమయం

Publish Date:Oct 15, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు కారణంగా వైసీపీ  నేతలలో అయోమయం నెలకొంటోంది. దీంతో వారు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో.. ఏ అంశానికి ఎలా స్పందిస్తున్నారో వారికే తెలియన పరిస్థితి ఆవిష్కృతమౌతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తాను అమరావతికి వ్యతిరేకమని ఎన్నడూ అనలేదని చెప్పడమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.

తాను అమరావతికి వ్యతిరేకం కాదని అంటూనే వికేంద్రీకరణే మా లక్ష్యం అని చెప్పడం ఆయనలో నెలకొన్న అయోమయానికి, ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతకు నిదర్శనంగా చెబుతున్నారు. మరో వైపు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం.. రాష్ట్రం నలుమూలలా మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమౌతుండటంతో జగన్ తీరుతో తమ రాజకీయ భవిష్యత్ ఏమౌతుందన్న భయం, ఆందోళన వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడేళ్ల పాలనలో బటన్ నొక్కడం తప్ప మరో పని చేయలేదంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ రేంజ్ లో వ్యక్తమౌతోందో గడపగడపకూ కార్యక్రమంలో కళ్లకు కడుతోంది.

అయితే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకూ కార్యక్రమంలో పడుతున్న ఇబ్బందులు, ఎదొర్కొంటున్న నిరసన సెగలనూ పట్టించుకోకుండా జగన్.. ఆ కార్యక్రమంలో చురుకుగా లేని వారికి వచ్చే ఎన్నికలలో టికెట్లు హుళక్కి అంటూ హెచ్చరికలు జారీ చేస్తండటంతో వారిలో నిరాశ, నిస్తేజం పెరిగిపోతున్నది. అయ్యేది కాక మానదు.. అన్న నైరాశ్యంతో అధినేత మాటలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే పరిస్థితికి వచ్చినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి విషయంలో ఒకే సమయంలో రెండు విధాలుగా అంటే అమరావతికి మద్దతుగా, వ్యతిరేకంగా మాట్లడడాన్నిఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. గడపగడపకూ సమీక్షలో జగన్ బొత్స తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బొత్స లాంటి సీనియర్ మంత్రికే ఉక్కపోత తప్పని విధంగా సీఎం జగన్ తీరు ఉందంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే మూడున్నరేళ్ల సమయం గడిచిపోయింది. మరో ఏడాదిన్నరలో ( ముందస్తు లేకపోతే) మళ్లీ ప్రజల ముందుకు వెళ్లాలి. ఏం చేశామని, ఏం సాధించామని మరో సారి అవకాశం ఇవ్వాలంటే ప్రజలను ఓట్లు అడగగలమన్న ఆందోళన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది.

రాజధాని అంశంలో స్థిరత్వం లేని జగన్ వైఖరిని ఇప్పుడు రాష్ట్రమంతా ప్రశ్నిస్తుంటే.. తమను మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలలో ప్రచారం చేయాలని ఆదేశించడమేమిటని ఎమ్మెల్యేలు తమలో తాము మధన పడుతున్నారు. అమరావతే రాజధాని అంటూ రైతుల మహాపాదయాత్రను జనం నిరాజనాలు పలుకుతుంటే.. తాము ఆ మహాపాదయాత్రకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి తమను ప్రజలలో మరింత చులకన చేస్తున్నదని మధన పడుతున్నారు. ఈ విషయాన్ని పలువురు వైసీపీ నేతల అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేశారు. ఒక్క అమరావతే అని కాదు.. రాష్ట్రంలో ఏ వర్గం కూడా జగన్ పాలన పట్ల, తీరు పట్ల సంతృప్తిగా లేదని ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద అంగీకరిస్తున్న పరిస్థితి. గత ఎన్నికలలో తమ విజయంలో కీలక పాత్ర పోషించిన దాదాపు అన్ని వర్గాలలోనూ ఇప్పుడు అసంతృప్తి గూడుకట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందుకు ఉదాహరణగా ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని చూపుతున్నారు. ఇక వ్యవసాయ మీటర్లకు మోటర్లు బిగించడంతో రైతులలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు. థర్మల్ స్టేషన్లను   అదానికి అప్పగించే కుట్ర, విశాఖలో భూ కబ్జా దందాలు.. ఇలా ఒకటనేమిటి.. జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతి చర్య, ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోందని పరిశీలకులు అంటున్నారు.   ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూలా మారిన మూడు రాజధానుల అంశాన్నే తీసుకుంటే.. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా మూడు రాజధానులంటూ మొండిగా జగన్ ముందుకు వెళ్లడాన్ని ఎలా అర్దం చేసుకోవాలో అర్ధం కావడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఏ విధంగా చూసినా మూడు రాజధానుల నిర్ణయంతో ముందుకు సాగలేని పరిస్థితి నెలకొని ఉంటే.. ఏ ఉద్దేశంతో మూడు రాజధానులే ముద్దంటూ ముందుకు సాగాలన్నది అవగతం కావడం లేదని వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. 

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.