ఖమ్మం కన్ఫ్యూజన్.. కాంగ్రెస్ క్యాడర్ లో ఆందోళన!

Publish Date:Apr 23, 2024

Advertisement

పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి.  గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి  కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తరువాత కూడా ఆ పార్టీలో ఆ విషయంలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో  పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పడుతున్న మల్లగుల్లాలే నిదర్శనం. రానున్న లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో  కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ స్థానమే అనడంలో సందేహం లేదు

. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్క స్థానం వినా జిల్లాలోని అన్ని స్థానాలనూ కైవశం చేసుకుంది. ఒక్క స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినా... ఆయనా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అటువంటి జిల్లాకు కేంద్రమైన ఖమ్మం లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పలు దఫాలు హైకమాండ్ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపినా అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 25 నామినేషన్ గడువు ముగుస్తుంది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి ఎవరన్నది తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉంది.  తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ, ఏప్రిల్ 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా కాంగ్రెస్ మాత్రం ఇంకా  మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక ఆపసోపాలు పడుతోంది.  ఈ జాప్యం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది.  

కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పక్కన పెడితే.. ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మాత్రం పార్టీ హైకమాండ్ కు సైతం తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వం  తమ వారికే ఇవ్వాలంటూ రేవంత్ కేబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు గట్టిగా పట్టుబట్టడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక    వివాదాస్పదంగా మారింది.    ఖమ్మం టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి, కాదు కాదు తన సతీమణి నిందినికే అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతుండటంతో ఎంపికలో జాప్యం జరుగుతోంది.  ఈ విషయంలో ఇహనో ఇప్పుడో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ జాప్యం పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందా అన్న ఆందోళన కేడర్ లో వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి వేవ్ లేదని రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర శర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేవ్ లెస్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలను ఎన్డీయేలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీ బోలెడంత రాజకీయ లబ్ధి పొందిందని ఆయన అన్నారు.
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చైనా భారత్ సరిహద్దు వివాదం చాలాకాలంగా నలుగుతూనే ఉంది. అయితే డ్రాగన్ దేశం భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా చైనా భారత్ మీద మరో అఘాయిత్యానికి పాల్పడింది. భారత పౌరుల చేత భారత్ మీదే సైబర్ నేరాలకు పాల్పడాలన్న చైనా  కుట్ర భగ్నమైంది. 
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరుగుతుంది. అయితే ఇప్పటికే కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అధికారికంగా ఫలితం వెలువడే వరకూ ఒకింత ఉత్కంఠ తప్పదు. కానీ గెలుపు గుర్రాలు ఏవీ, పరాజయం పాలై పలాయనం చిత్తగించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగులను బట్టి సులువుగానే అర్ధం అవుతున్నది.
పెద్దలు సాధారణంగా నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటారు. కానీ చాలామంది కడుపులో రాళ్ళు పెంచుకుంటున్నారు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంటే నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఎ). ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎకు ఇప్పుడు మోడీ పదేళ్ల పాలనలో ఎన్డీయేకూ అసలు పోలికే లేదు. ఇప్పుడు ఎన్డీయేలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగలలేదు. తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం, జనసేన వినా ప్రస్తుతం ఎన్డీయేలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
ఏపీలో వైసీపీ నేత‌ల రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వారి త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును అడ్డుపెట్టుకోవ‌టం వారికి అల‌వాటుగా మారింది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఐదేళ్లుగా ఇదే ప‌ని చేశారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని తంబిగాని పల్లెలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డాయి.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నియోక‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఏపీలో పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రులు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌కర్త‌ల‌పై దాడులకు తెగ‌బ‌డి భ‌య‌ బ్రాంతుల‌కు గురిచేశారు.
పిరికి పిల్లి పిన్నెల్లి చేసిన పాపాలకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాక కోసం సెంట్రల్ జైలు గేటు ఎదురుచూస్తోంది.
మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.