రాజకీయ క్రీనీడలో బడుగుల హాస్టళ్లు!
Publish Date:Aug 1, 2022
Advertisement
ఓ గదిలో పది మంది పిల్లలు, వీలయినంత నీరసంతా ఉన్నారు. హఠాత్తుగా ఒకామె వచ్చి పెద్ద గిన్నెతో అన్నం, నీరు లాంటి పప్పు తెస్తుంది. మరొకడు వచ్చి కంచాల్లాంటివి పిల్లల ముందు పడేస్తాడు. వారికి ఆమె ఆ తెచ్చిందే వడ్డించి వెళిపోతుంది. వాళ్లు చచ్చేంత ఆకలితో ఉండడంతో అమాంతం తినేస్తుంటా రు. ఇదంతా ఓ సినిమా సీన్. ఇందుకు పెద్దగా భిన్నంగా ఏమీ ఉండనివి మన తెలుగు రాష్ట్రాల్లోని బిసీ ఎస్టీ ఎస్సీల హాస్టల్ పరిస్థితులు. ఇపుడు కాస్తంత జనం ప్రశ్నిస్తున్నారు గనుక, నాయకులనూ నిలదీస్తు న్నారు గనుక మరీ దారుణ పరిస్థితి లేదని సంబం ధిత అధికారులు అంటున్నారు. వాస్తవాన్ని ఎవరు మాత్రం అంగీకరిస్తారు? ఇవాళిటి పిల్లలే రేపటి పౌరులు అనే నినాదం ఆనాదిగా ఉంది. కానీ ఆరోగ్యం మాటేమిటి? వారి ఆరోగ్యా న్ని మాత్రం ప్రభుత్వాలు అంతగా పట్టించుకోవు. ఎవరూ ఏ పార్టీ వారూ గట్టిగా పట్టించుకోరు. కేవలం సంబంధిత ప్రజాసంఘాలవారు ఆగ్రహం వచ్చినపుడల్లా గొంతు చించుకుని రోడ్ల మీదకి వస్తుంటారంతే. అసలు ఇలాంటి హాస్టళ్లలో ఉండేవారు కనీసం రెండు పూటలా గడవని కుటుంబాల నుంచి వచ్చినవారే. వారిలో చాలామందికి చదువుకోవాలన్న ఆకాంక్ష ఎక్కువగానే ఉంటుంది. మంచి చదువు చదివి ఇంటికి వెళ్లి తనవారిని పోషించాలన్న ఆలోచనా ఉంటుంది. హాస్టలు ఇల్లులా ఉంటుందని వారికేమీ పెద్ద నమ్మ కం ఉండదు. కాకుంటే మరీ అన్యాయంగా ఉండదనే అనుకుంటారు. చాలాకాలం నుంచి ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టళ్లు, స్కూలు హాస్టళ్లు అనగానే అందరికీ వాటి నిర్వహణ మీద పెద్ద నమ్మకం లేదు. ఆ విధమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమే అనేది ప్రజా సంఘాల మాట. ఎప్పుడూ ఓట్లు రాజకీయమే కాకుండా పిల్లల ఆరోగ్యం, విద్య, వారి హాస్టళ్ల మౌలిక సదుపాయాలు, నిర్వహణ గురించిన దృష్టి కూడా ఉండాలని వారి నినాదం. తెలుగు రాష్ట్రాల్లో ఏ పట్టణం లో నైనా హాస్టళ్ల పరిస్థితులు ఇలానే ఉండటమే ఆశ్చర్యపరుస్తుంది. పిల్లలు కాస్తంత మంచి తిండి తిని, చదువు మీద దృష్టిపెట్టి బాగుపడతారని పిల్లల తల్లిదండ్రులు గంపెడాశతో ఇళ్లదగ్గర నిమ్మళంగానే ఉం టారు. కానీ వాస్తవ చిత్రం వారికి అంతగా తెలియక కాదు. కానీ అధికారులను, ప్రబుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేరు. సామాజిక కార్యకర్తలు, ఎస్సీఎస్టీ, బిసీ సంఘాల నాయకులు వారికిమద్దతుగా ఉద్యమాలు, ప్రదర్శనలు, ప్రచారాలు, నినాదాలతో ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతూనే ఉంది. ప్రభుత్వం వారి మాటలు, నినాదాలు వినడంతోనే సరిపెట్టుకుంటోంది. అభ్యర్ధనలు, వినతులు అన్నీ బుట్టదాఖలవుతూనే ఉన్నా యన్నది పరిస్థితులను గమనిస్తున్న విశ్లేషుకులు అంటున్నారు. అవినీతి తిమింగలాల పై చర్యలు లేక పోగా ఇంకా వారినే సంబంధిత అధికారులుగా కొనసా గించడం చూస్తే పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ కన్నా తమ రాజకీయ స్వార్ధంతో పిల్లల ఆరోగ్యాన్ని, భవితను గాలికి వదిలేస్తున్నారు. అసలు హాస్టళ్లను కాంట్రా క్టుకు ఇవ్వడం, అలా అధికారం చెలాయించేవారు తమకు తోచినవిధంగా వ్యవహరిస్తూ ధనార్జనకు పాల్ప డడమే తప్ప పిల్లల ఆరోగ్య, విద్య అభివృద్ధిని పట్టించుకోవడంలేదు. సదరు కాంట్రాక్టర్లు సంబంధిత పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులతో చెలిమితో తీవ్రస్థాయిలో వ్యవహరించడం అప్పుడపుడూ మీడియా ద్వారానే బయటపడుతోంది. ఇటీవల కొన్ని హాస్టళ్లలో ఆహారంలో పురుగులు రావడం గురించిన వార్తలు విని చాలామంది భయపడ్డా రు. ఒకటి రెండు ప్రాంతాల్లో ఏకంగా పిల్లలు ఒకరిద్దరు పారిపోయారన్నవార్తలు వినవచ్చాయి. అసలు హాస్టళ్ల వాస్తవ పరిస్థితుల సంగతి తల్లి తండ్రులకు చెప్పకపోవడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. కనీసం ఘట న జరిగిన తరువాత అయినా విచారణ జరిపి చర్యలు తీసుకోకపోవడం పై ప్రభుత్వ ప్రై వేట్ వసతి గృహా ల నిర్వాహకుల పట్ల తల్లి తండ్రులు తీవ్ర ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే బాసర ఐ ఐ ఐ టి పరిస్థితి మరీదారుణం గా ఉండటం ఆశ్చర్యపరుస్తుందని ఇటీవలి సంఘటనలు తెలియజేశాయి. నాసిరకం ఆహారం పెడుతూ,నాణ్యత ప్రమాణాలు పాటించని మెస్ నిర్వాహకుల పుణ్యమా అని పిల్లలు అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలైనా చనిపోతున్నా తమకేమి పట్టదని అటు ప్రభుత్వం ఇటు మెస్ నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తే విద్యార్ధులపై దాడులు చేయడం యాజమాన్యం బెదిరింపులకు దిగడం పట్ల సర్వత్ర నిరసనలు వ్యక్త మౌతున్నాయి. విద్యార్ధులకు మద్దతుగా నిలిచిన విద్యార్థి సంఘాల ను అరెస్టు చేయడం విద్యార్ధుల డిమాండ్ ను అమలు చేయకుండా కాలయాపన చేయడం చూస్తుంటే విద్యార్ధుల సమస్యల పరిష్కారం లో ప్రభుత్వం చిత్తసుద్ధిని శంకిచాల్సి వస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే న్యాయ పోరాటం చేసేందు కైనా సిద్ధమని విద్యార్ధి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అందులో భాగంగానే ఆదివారం (జులై 31) శ్రీనగర్ కాలనీలోన విద్యాశాఖ మంత్రి సబిత ఇంటిని విద్యార్థుల తల్లిదండ్రులు ముట్టడించి ధర్నాకు దిగారు. బాసరలోని త్రిబుల్ ఐటీ హాస్టల్ లో సౌకర్యాల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన సౌకర్యాలు కల్పించలేకుంటే ట్రిపుల్ఐటీనే మూసేయండి కానీ విద్యార్థుల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాలాలు వద్దని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/conditiona-inwelfare-hostels-are-terifying-39-141017.html





