సురవరం సుధాకరరెడ్డి అస్తమయం

Publish Date:Aug 22, 2025

Advertisement

సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి  కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు.  ఆయనకు భార్య డాకర్‌ బివి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్‌, కపిల్‌ ఉన్నారు.   ఆయన సతీమణి కూడా కమ్యూనిస్టు నాయకురాలే.  ఏఐటీయూసీలో పని చేస్తున్నారు. సురవరం ఆరోగ్యం క్షీణించడంతో గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది సేపటికే సురవరం మరణవార్త తెలియడంతో కమ్యూనిస్టు నాయకులు, శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె. నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు  పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి. నరసింహ, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, పల్లా నర్సింహారెడ్డి,  సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ హుటాహూటిన ఆసుపత్రికి వెళ్లి సురవరం భౌతిక కాయానికి నివాళి అర్పించారు.   ముఖ్యమంతి  రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షనేత కేసీఆర్, టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సహా పలువురు నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.  విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌ నాయుడు, సినీ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఒంగోలు నుంచి సంతాపం తెలియజేశారు. 
సురవరం కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆయన తుది సంస్కారం ఆదివారం (ఆగస్టు 24)న జరగనుంది.  సురవరం భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధంఆదింవారం ఉదయం పది గంటలకు మగ్ధుంభవన్ తరలిస్తారు.  మధ్యాహ్నం అంతిమ యాత్ర జరగనుంది. అదే రోజు సాయంత్రం సురవరం పార్థీవ దేహాన్ని  గాంధీ బోధానాసుపత్రికి అప్పగించనున్నారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో 1942, మార్చి 25న జన్మించిన సురవరం సుధాకరరెడ్డికి తెలంగాణ వైతాళికుడు, గోల్కోండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి  పెదనాన్న. సుధాకరరెడ్డి ప్రాథమిక విద్య కంచుపాడులో జరిగింది.   ఆ తరువాత కర్నూలులోని కోల్స్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. కర్నూల్‌లోనే ఉస్మానియా డిగ్రీ కాలేజీలో బిఎ చదివారు. అదే సమయంలో ఆయనకు విద్యార్థి ఉద్యమాలతో సంబంధాలు ఏర్పడి, ఎఐఎస్‌ఎఫ్‌లో చేరారు. ఆయన హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై  పోరాటాలు చేశారు.  అనంతరం పార్టీ ఆదేశాల మేరకు విశాలంధ్ర విలేకరిగా హైదరాబాద్‌కు వచ్చారు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి అడ్మిషన్‌ లభించింది. ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఎస్‌ఎఫ్‌, వైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో పని చేశారు. ఆ సమయంలోనే  దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కలకత్తా, ఢిల్లీ, లక్నో  జైళ్లలో శిక్షలు అభవించారు. సురవరం సుధాకరరెడ్డి    చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌.  
రాష్ట్రానికి తిరిగి వచ్చి పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తూ కర్నూలు జిల్లా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో, మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దకొత్త పల్లి మండలంలో, మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో పాటియాల రాజా భూముల ఆక్రమణ పోరాటాల్లో పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపుదల వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన సమయంలో గుర్రాలతో తొక్కించడంతో  గాయపడ్డారు.  ఆయనపై ప్రభుత్వం పలు కేసులు బనాయించింది. అయినా ఎక్కడా వెరవలేదు. ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యారు. సురవరం సుధాకరరెడ్డి ప్రాజెక్టుల కోసం పదిరోజులు పాదయాత్ర నిర్వహించారు. అలాగే విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్‌బాడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గ సభ్యుడిగా యువజన  మాసపత్రిక, యూత్‌ లైఫ్‌ మాసపత్రిక,  న్యూ జనరేషన్‌ వారపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు.  ఆంధ్రప్రదేశ్‌ దర్శిని  ఎడిటోరియల్‌ బోర్డ్‌ సభ్యునిగా పనిచేశారు. 1995 ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు సమితి సహాయ కార్యదర్శిగా  పనిచేశారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి  ఎంపిగా విజయం సాధించారు. 

2004 యుపిఎ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల సంక్షేమ ముసాయిదా బిల్లును రూపొందించడంలో సురవరం సుధాకరరెడ్డి కీలక పాత్ర పోషించారు. అలాగే ఐక్యరాజ్య సమితి  సాధారణ  సమావేశాల్లో భారత పార్ల మెంట్‌ తరుపున   ప్రతినిధిగా వెళ్లారు. 2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన సుధాకరరెడ్డి ఆ తరువాత  2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు.   2019 జులై 24న అనారోగ్యం కారణంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.