మంత్రి లోకేష్‌ను కలిసిన కామన్వెల్త్ పతక విజేత అజయ్

Publish Date:Aug 6, 2026

Advertisement

 

ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు.. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లి నివాసంలో కలిశారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. 

కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరచిన వల్లూరి అజయ్ బాబును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తండ్రి కాంస్య పతకం సాధించగా.. కుమారుడు 16 ఏళ్ల తర్వాత రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించారని ప్రశంసించారు. 

వచ్చే ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అజయ్ బాబును మంత్రి శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ ఎస్.భరణి పాల్గొన్నారు. 

Commonwealth medalist Ajay, Minister Lokesh, Glasgow, Weightlifting, Vizianagaram District, CM Chandrababu
 

By
en-us Political News

  
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్‌ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
అదృష్టం అనేది ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటలీలో ఒక మహిళను వరించిన భారీ అదృష్టం క్షణాల్లో చేజారిపోయినట్లే కనిపించినా, చివరికి అనూహ్య రీతిలో ఆమె వద్దకే చేరింది.
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్‌ చెక్ పెట్టాయి.
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్‌లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పిరాన్, ఏలియన్‌వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.