జిమ్ లో చేసే కామన్ మిస్టేక్స్.. చాలా డేంజర్ ఇవి!

Publish Date:Jun 26, 2026

Advertisement

ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి. అవి వారి ఆరోగ్యం పై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయి.  తెలియకుండా చేసే కొన్ని తప్పులు  కొన్ని సార్లు చాలా డేంజర్ గా మారతాయి.  ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం జిమ్ లో చేసే  ఒక పొరపాటు ప్రాణానికి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది.  అలాంటి తప్పులేంటో తెలుసుకుంటే.. జిమ్ కు వెళ్ళినప్పుడు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు.

పళ్లు బిగించడం..

జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే పళ్ళు బిగిస్తారు లేదా కొరుకుతారు. బరువైన వెయిట్ లిఫ్టింగ్, పుష్-అప్స్, ప్లాంక్స్, డెడ్‌లిఫ్ట్స్ లేదా ఇతర శ్రమతో కూడిన వ్యాయామాలు చేసేటప్పుడు ఈ అలవాటు ప్రత్యేకంగా సాధారణం.  

సమస్య..

ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు  పళ్ళు బిగిస్తే, దవడ కండరాలు నిరంతరం ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి క్రమంగా తలకు ఇరువైపులా ఉండే కణతల కండరాలకు , మెడ కండరాలకు వ్యాపిస్తుంది. దీని ఫలితంగా, వ్యాయామం తర్వాత తల బరువుగా అనిపించడం, ఒత్తిడి తలనొప్పులు , మెడ పట్టేయడం వంటివి జరుగుతాయి.

దవడ , మెడ కండరాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. పళ్ళు బిగపట్టడం వల్ల  మెడ కండరాలు కూడా అనవసరంగా బిగుసుకుపోతాయి. దీనివల్ల మరుసటి రోజు మెడ బిగుసుకుపోవడం, నొప్పి , మెడను కదపడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు.

ఈ సమస్య ఎవరికి వస్తుంది?

బరువులు ఎత్తే వ్యక్తులు, కొత్తగా జిమ్‌కు వెళ్లేవారికి,  ఒత్తిడి లేదా ఆందోళన ఉన్న వ్యక్తులకు,  వ్యాయామం చేసేటప్పుడు తమ శరీరాన్ని అతిగా బిగుతుగా ఉంచుకునేవారికి ఇది వస్తుంది.

వ్యాయామం తర్వాత మీకు తరచుగా తలనొప్పి, దవడ నొప్పి, చెవుల చుట్టూ ఒత్తిడి లేదా మెడ బిగుసుకుపోవడం వంటివి ఎదురైతే, అది కేవలం అలసట వల్ల మాత్రమే కాకుండా, వ్యాయామం చేసేటప్పుడు పళ్ళు కొరికే అలవాటు వల్ల కూడా కావచ్చు అనే  విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ చిన్న తప్పును సరిదిద్దుకోవడం చాలా మంచిది.

                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.