పులివెందుల వదిలి బయటకు రా.. జగన్‌కు జనసేన సవాల్!

Publish Date:Jun 23, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోదశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న కడప జిల్లా, మరీ  ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి వైసీపీ కోటలు ఎక్కడికక్కడ బద్దలయ్యాయి, బీటలు వారాయి.  రాయలసీమ వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అఖండ విజయాలు సాధించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఘోర పరాజయం ఎదురైనా, కడప కోట బీటలు వారినా.. పులివెందుల మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడింది.  

 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు పులివెందులలో ఏకంగా 90,000 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. అయితే   2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆ మెజారిటీ 30 వేలు తగ్గి  60,000 ఓట్లకు పడిపోయింది. ఈ గణాంకాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు జనసేన పార్టీ నేతలు వైసీపీ అధినేత జగన్  తీవ్ర స్థాయిలో విమర్శల దాడిని ప్రారంభించారు. పులివెందుల దాటితే జగన్ చెల్లని రూపాయితో సమానమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

తాజాగా కాకినాడ రూరల్   ఎమ్మెల్యే, జనసేన నాయకుడు  పంతం నానాజీ  జగన్ కు విసిరిన సవాల్  ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.  పులివెందుల అనే సేఫ్ జోన్ దాటి బయటకు వచ్చి, తన నిజమైన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందుల వదిలి, బయటకు రా జగన్..  కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి చూపితే, నిజమైన నాయకుడిగా అందరూ గుర్తిస్తారని పంతం నానాజీ జగన్ కు సవాల్ విసిరారు. . పులివెందుల దాటి బయట గెలవనంత కాలం రాజకీయాల్లో సెకండ్ గ్రేడ్ లీడర్‌గానే మిగిలిపోతారంటూజగన్ పై  విమర్శలు గుప్పించారు.  భీమవరం, గాజువాకల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కేవలం కాపు సామాజికవర్గ సమీకరణాలను వాడుకుని గెలిచారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా జనసేన ఈ స్థాయిలో  రిటార్డ్ ఇచ్చింది. 

ఈ సవాల్ సోషల్ మీడియాలో  తెగ  వైరల్‌గా మారింది.  జగన్ ఎప్పుడూ తన సొంత నియోజకవర్గం మినహా వేరే ఎక్కడా పోటీ చేసే ధైర్యం చేయలేదంటూ నెటటిజనులు తెగ  ట్రోల్ చేస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో నారా లోకేష్ మంగళగిరి లాంటి క్లిష్టమైన స్థానాన్ని ఎంచుకుని గెలిచారని, పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో నిలబడి గెలిచి చూపించారని, మరి జగన్ ఎందుకు ఎప్పుడూ పులివెందులకే పరిమితం అవుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  అయితే..  పంతం నానాజీ  సవాల్ విసరడంతో పాటు జగన్ పై అభ్యంతరకర పదాలను వాడటంపై కూడా నెటిజనులు తప్పుపడుతున్నారు.  రాజకీయాల్లో ఇలాంటి అనుచిత, అభ్యంతరకర భాషను స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమర్థించరంటున్నారు. అది పక్కన పెడితే పులివెందుల వదిలి బయటకు రా జగన్ అన్న సవాల్ మాత్రం రాజకీయ హీట్ ను అమాంతంగా పెంచేసింది.  పులివెందుల కోటలో మెజారిటీ తగ్గడం, ఇప్పుడు జనసేన ఏకంగా నియోజకవర్గం దాటి రావాలని ఛాలెంజ్ చేయడం వైసీపీని ఒక్కసారిగా డిఫెన్స్ లో పడేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.