తెలంగాణపై చలి పులి పంజా!

Publish Date:Nov 15, 2022

Advertisement

తెలంగాణ చలిపులి పంజా దెబ్బకు విలవిలలాడుతోంది. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఉదయం పది గంటల వరకూ బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొని ఉంది. విపరీతమైన చలి కారణంగా ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  మంగళవారం(నవంబర్15)న రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 20వ తేదీ వరకూ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకూ పడిపోవచ్చని పేర్కొన్నారు.

విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్వాస సంబంధిత రుగ్మతలు ఉన్న వారు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగ మంచు కారణంగా వాయుకాలుష్యం కూడా హెచ్చుగా ఉంటుందని హెచ్చరించారు. మాస్కుల వాడకం ద్వారా కాలుష్యం ముప్పును కొంత వరకూ అధిగమించవచ్చని పేర్కొన్నారు.

ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రంగా ఉంటోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
 

By
en-us Political News

  
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.