అన్నదాతలకు అండగా బొద్దింకలు.!
Publish Date:Jul 30, 2026
Advertisement
ఇప్పటివరకు సోషల్ మీడియాలో, స్టూడెంట్ ప్రొటెస్ట్‌లలో మాత్రమే వినిపించిన పేరు... కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)! ఇప్పుడు ఈ బొద్దింకలు రైతు సంఘాలతో చేతులు కలిపాయి. నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. రైతులు, కాక్రోచ్ ల కలయిక నిస్పందేహంగా కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇన్నేళ్లలో ఎదురైన నిజమైన, బలమైన సవాళ్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి.. గతంలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం, తాజాగా నీట్ లీకేజీకి నిరసనగా ఉవ్వెత్తున ఎగసిన కాక్రోచ్ ల ఆందోళన. రెండు సందర్భాలలోనూ కూడా మోడీ సర్కార్ దిగి వచ్చి వారి డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు శక్తులూ ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో భవిష్యత్ లో వీరి కలయిక మోడీ సర్కార్ ను ఏ స్థాయిలో ఇరుకున పెడుతుందీ అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. జంతర్ మంతర్ వేదికగా సిజెపి నాయకులు, రాకేష్ తికాయత్ సహా 500 మంది రైతులతో భేటీ అయ్యారు. గురువరాం(జులై 29) జరిగిన ఈ భేటీ..కాక్రోచ్ లు ఉద్యమ బాట వీడలేదనీ. కేవలం విద్యా సమస్యలే కాదు, కర్షకుల సమస్యలపైనా తాము ఉద్యమిస్తామనీ, అన్నదాతలకు అండగా నిలుస్తామని ఈ భేటీ ద్వారా సందేహాలకు అతీతంగా పరోక్షంగా ప్రకటించారు. విద్యార్థులు, యువత, రైతులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తే.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కేందరంలోని మోడీ సర్కార్ పై ఒత్తిడి కొన్ని రెట్లు ఎక్కువ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ ల ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, లేదంటే.. తన ఉద్యమాన్నినెక్స్ట్ లెవెల్ కు తీసుకువెడతామనీ సీజేపీ కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అల్టిమేటమ్ ఇచ్చిన రోజువ్యవధిలోనే... కాక్రోచ్ జనతా పార్టీ నేతలు రైతు సంఘాల నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. Cockroach Janta Party, Rakesh Tikait, NEET Protest Delhi, CJP Farmers Protest, Jantar Mantar Protest, Dharmendra Pradhan, Gen Z Protest India, CJP Foreign Funding Court
http://www.teluguone.com/news/content/cockroach-janta-party-25-227541.html





