అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసంఫై కాకా ఆవేదన
Publish Date:Jan 24, 2012
Advertisement
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలహీన నాయకత్వం వల్లే అంబేద్కర్ విగ్రహాలను కూల్చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి అన్నారు. అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడంపై కాకా ఆవేదన వ్యక్తం చేశారు.విగ్రహాలు కూలుస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ దళితుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ధ్వంసం చేసిన విగ్రహాలను తక్షణమే నూతన విగ్రహాలను ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.మరోవైపు అమలాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ జాగృతి సంస్థ డిమాండ్ చేసింది. అలాగే డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అబేందర్క్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలు కవిత ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
http://www.teluguone.com/news/content/cmkiran-kumar-reddy-24-11200.html





