సీఎం విజయ్‌కు భార్య సంగీత షాక్.. విడాకుల పిటిషన్‌లో సంచలన ఆరోపణలు!

Publish Date:Jun 15, 2026

Advertisement

 

విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసిన చెంగల్పట్టు కోర్టు..

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సోమవారం చెంగల్పట్టు మహిళా కోర్టులో కీలక విచారణ జరిగింది. ఇరుపక్షాల లాయర్ల వాదనలను విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

గత ఏప్రిల్ నెలలోనే ఈ కేసు కోర్టు ముందుకు వచ్చినప్పటికీ, ఇద్దరూ హాజరుకాకపోవడంతో జూన్ 15న ఖచ్చితంగా రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం కోర్టు ఈ కేసును పరిశీలించింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సంగీత ప్రత్యేక వివాహాల చట్టం కింద విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భర్త వల్ల తాను ఎన్నో అవమానాలు, మానసిక క్షోభ అనుభవించానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

విజయ్‌కు మరో సినీ నటితో వివాహేతర సంబంధం ఉందని సంగీత సంచలన ఆరోపణలు చేశారు. సదరు నటితో కలిసి ఆయన విహారయాత్రలకు వెళ్లడమే కాకుండా, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తనను, తన ఇద్దరు పిల్లలైన జాసన్ సంజయ్, దివ్య సాషాలను సమాజంలో తలదించుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయంపై నిలదీస్తే ఆ బంధాన్ని కట్ చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశారని తెలిపారు.

వీటితో పాటు తనపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించారని, తన వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించారని సంగీత కోర్టుకు వివరించారు. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న సౌకర్యాలను సైతం విజయ్ ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. ఈ కారణాల వల్ల 2000 సంవత్సరంలో మొదలైన తమ 26 ఏళ్ల వైవాహిక బంధాన్ని ఇక్కడితో ముగించాలని తాను గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఒకవైపు కోర్టులో ఈ తరహా వ్యక్తిగత గందరగోళం నడుస్తుండగా, రాజకీయంగా మాత్రం విజయ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆయన నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే కూటములను మట్టికరిపించి మే 10న ఆయన సీఎంగా పీఠాన్ని అధిరోహించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఈ విడాకుల కేసు తీవ్ర రూపం దాల్చడం తమిళ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇటు సినిమా ఫ్యాన్స్, అటు రాజకీయ అనుచరులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే ఆగస్టు 7వ తేదీన జరగబోయే తదుపరి కోర్టు విచారణలో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By
en-us Political News

  
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.