ప్రధాని ముఖం మీదే రాష్ట్ర నిధుల విడుదల డిమాండ్: తమిళనాడు సీఎంపై ప్రశంసల వర్షం.!
Publish Date:Oct 12, 2026
Advertisement
దేశ రాజకీయాల్లో చాలామంది నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమాలలో కేవలం ఆయనను ప్రశంసించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో చాలా మంది నేతలు మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయాన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే రాష్ట్ర సమస్యలను, అలాగే రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. ఈ వేదికపై ప్రసంగించిన ముఖ్యమంత్రి విజయ్, కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన 5 వేల ఒక వంద కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధాని మోదీని నేరుగా కోరారు. కోరారు అనడం కంటే డిమాండ్ చేశారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ నిధులు ఎంతో కీలకమని, ఎలాంటి ఆలస్యం లేకుండా వీటిని అందించాలని విజయ్ నొక్కి వక్కాణించారు. నిధులతో పాటుగా తమిళనాడులోని పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కూడా సీఎం విజయ్ మాట్లాడారు. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు రాష్ట్రంలో కీలకమైన జాతీయ రహదారుల విస్తరణ, నూతన రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో తన అభిప్రాయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేసిన సీఎం.. ఎంతటి పెద్ద వేదికైనా రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించారు. సామాన్యంగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభలలో స్థానిక నాయకులు పొగడ్తలకే పరిమితమవుతారని, అయితే విజయ్ మాత్రం రాష్ట్ర నిధుల సాధన కోసం ఈ వేదికను వేదికగా మలుచుకున్నారని రాజకీయవర్గాలలో విజయ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. [CM Vijay Demand Funds In Presense Of Narendra Modi, Tamil Nadu Politics, Developement Projects, Tamilnadu Developement, Chennai Kanyakumari High Speed Train]
http://www.teluguone.com/news/content/cm-vijay-demand-funds-in-presense-of-narendra-modi-39-234142.html




