ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం విజయ్

Publish Date:May 10, 2026

Advertisement

 

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై ఫైలుపై తన మొట్టమొదటి సంతకాన్ని చేశారు. ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని కీలక నిర్ణయాలపై ఆయన సంతకాలు చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేసే ఫైలుపై రెండో సంతకం చేయగా, యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు 'ఈగల్' తరహా నిఘా వ్యవస్థ ఏర్పాటుకు మూడో సంతకంతో పచ్చజెండా ఊపారు. సంక్షేమం, రక్షణే తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మహిళల భద్రతను అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, వేధింపులు, దాడులు, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమిళనాడులో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. యువతను రక్షించేందుకు డ్రగ్స్ నెట్‌వర్క్‌పై సమగ్ర దాడి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పారదర్శకత కోసం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని సీఎం తెలిపారు. ప్రజలకు నిజమైన ఆర్థిక స్థితిని తెలియజేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ“శత్రువులైనా… మిత్రులైనా… 8 కోట్ల ప్రజలంతా నా ప్రజలే” అని వ్యాఖ్యానించారు. 

కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ “My Dear Virtual Warriors… New Era Starts Now” అంటూ కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయాలతో విజయ్ ప్రభుత్వం ప్రజల అంచనాలను ఎంతవరకు నెరవేర్చుతుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. టీవీకే కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే విజయ్ తన మంత్రివర్గ సహచరులతో భేటీ అయి, పాలనను పరుగులు పెట్టించే దిశగా పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అవినీతి రహిత పాలన అందిస్తారన్న నమ్మకంతో తమిళ ప్రజలు విజయ్ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారు.

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.