పని తీరు బాలేని మంత్రులకు ఉద్వాసన.. పీపుల్స్ చాయిస్ బడ్జెట్.. పాలనలో తమిళనాడు సీఎం ముద్ర.!

Publish Date:Aug 3, 2026

Advertisement

తమిళనాడు సీఎం  విజయ్  తనదైన ప్రత్యేక శైలిలో ప్రజాదరణ చూరగొంటూ సంచలన నిర్ణయాలతో  పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.   హామీలను నెరవేర్చడంలోనూ, ఆ దిశగా పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ విజయ్ వేగం  తమిళనాటే కాకుండా దేశ వ్యాప్తంగా  హాట్ టాపిక్‌గా మారింది.  

ఇటీవలే  తన మంత్రివర్గం పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన విజయ్.. పాలనలో పారదర్శకత, బాధ్యత లేని ప్రవర్తనను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా..  పనితీరులో నాట్ ఆప్ టు ద మార్క్ అని తేలిన నలుగురు మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయించారు.  ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్, రవాణా శాఖ మంత్రి ఎ. విజయ్ తమిళన్ పార్తిబన్‌లపై వచ్చిన వరుస ఫిర్యాదులు, హెచ్చరించినా తీరు మారకపోవడంతో వారిపైనా, అలాగే..  విమర్శలు, వివాదాల కారణంగా సామాజిక సంక్షేమ శాఖ మంత్రి కె. జగదీశ్వరి, అదే కారణాలతో   హెచ్‌ఆర్‌ఎమ్ మంత్రి డి. శరత్‌కుమార్ లపై వేటు వేయాలని విజయ్ భావిస్తున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.  

కేవలం పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం  వెట్రి తమిళగం విజన్  పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద  50 వేల  కోట్ల  రాష్ట్ర పెట్టుబడి నిధి  ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు. సాంకేతిక రంగానికి కేటాలిస్ట్‌గా నిలిచేలా  అరివంగం  పేరుతో అత్యాధునిక  ఏఐ సిటీ  నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలను తమిళనాడుకు ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ఈఏఐ సిటీని నగరాన్ని తీర్చిదిద్దనున్నారు.

ప్రజా సంక్షేమం, బ్యూరోక్రసీ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తేవడానికి విజయ్ సర్కార్  నో అప్లికేషన్    విధానాన్ని తీసుకువస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికైనా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో ఆధార్ అనుసంధానిత ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులను   గుర్తించి, వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా పథకాల ప్రయోజనాలను అందిస్తారు. దీనికి తోడు ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు  పీపుల్స్ ఛాయిస్ బడ్జెట్ భావనను అమలులోకి తేవాలని నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లా నిధులలో ఏకంగా 10 శాతం నిధుల వినియోగాన్ని స్థానిక ప్రజల నిర్ణయానికే వదిలేస్తారు. తమ ప్రాంతానికి ఏ రకమైన అభివృద్ధి పనులు అవసరమో ప్రజలే నేరుగా నిర్ణయించుకునే హక్కును కల్పించడం ద్వారా సీఎం విజయ్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.   
 
CM Vijay, Tamil Nadu Politics, AI City Arivangam, Vetri Thamizhagam Vision, Vijay Cabinet ministers, oust,  TN State Investment Fund                                                                                      

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.