ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి : సిద్దరామయ్య

Publish Date:Jul 10, 2025

Advertisement

 

కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందనే వార్తలు అవాస్తవని సీఎం అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య తెలిపారు."ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా సీఎం పదవికి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే 'ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు' అని ఆయనే అన్నారు కదా" అని సిద్ధరామయ్య గుర్తు చేశారు.

డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు
 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.