వర్షాలు పడొద్దని అఘోర పూజలు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Aug 13, 2026

Advertisement

 

ఇందిరమ్మ ఇండ్లు  టవర్స్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి  కీలక వ్యాఖ్యలు..!

హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి  ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేమాట్లాడుతూ.. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూకట్‌పల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో.. మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాని తెలిపారు.

కానీ ఇప్పుడు కూకట్‌పల్లిని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అధికారాలు, అవకాశాలు మా ప్రభుత్వానికి ఉన్నాయి. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును ఆదేశిస్తున్నాని సీఎం స్పష్టం చేశారు.

పదేళ్ల వారి పాలనను.. రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణలో 3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని

ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

కడుపులో విషం పెట్టుకుని కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా.. మా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆడబిడ్డలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం.. మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిందా?పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో లక్ష ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాను. మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాదే. ఈ విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసానిచ్చారు.సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. పదేళ్ల వారి పాలనను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి.

నాకు వయసు ఉంది.. ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం.కొంతమంది దుర్మార్గులు రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు. అయినా దేవుడు మన వైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. మంచి మనసుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న మా సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉంది.కుటిల బుద్ధితో క్షుద్ర పూజలు చేసే వారికి.. ఆ కుట్రలే తిరిగి వారినే అష్టదిగ్బంధనం చేస్తాయి. మీరు అండగా ఉండండి.. తెలంగాణను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

CM Revanth Reddy,  Indiramma Indlu Towers, Indiramma Housing Scheme, Kukatpally Development,Telangana Government, Double Bedroom Houses,Telangana Politics


 

By
en-us Political News

  
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినాదించిన మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల అసెంబ్లీ అన్నఆయన ఆశయానికి సజీవ రూపంగా నిలవనుంది.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీలకు తావులేకుండా, దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారు. కార్డు ముందరి భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్  ఆధారిత హోలోగ్రామ్ వంటి రక్షణ అంశాలను పొందుపరిచారు.
పుష్కరాల సందర్భంగా రాష్ట్ర  సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది.  ఇందులో భాగంగా  సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది.  
అమెరికా సైనిక పాటవానికి, అత్యాధునిక నిఘా సాంకేతికతకు నిదర్శనంగా నిలిచే శక్తిమంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ వ్యవస్థపై ఇరాన్ దాడి తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల బలగంలో  25 శాతం డ్రోన్లు ధ్వంసమయ్యాయి.
 తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్   నిర్మిస్తున్న  విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో   కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో  టన్నెల్ పైభాగం నుంచి భారీ కొండచరియలు  విరిగిపడ్డా
ది న్యూయార్క్ టైమ్స్ అమరావతి నిర్మాణం, పురోగతి, ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక ఖాతా ద్వారా షేర్ చేశారు.
సర్ కారణంగా తన ఒక్కడి ఓటే కాదు.. బెంగళూరు వ్యాప్తంగా  65 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని ఆధారాలతో సహా ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 
గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేదికగా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయ
హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..!
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.