రాష్ట్రంలో ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో ఒక నెల అయిన ప్రభుత్వాస్పుపత్రిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తర్వాత 11 నెలలు మీకు నచ్చిన ప్లేస్‌లో జీతం చేసుకుని మంచి జీవితం లీడ్ చేయండి అన్నారు. సామాజిక బాధ్యత కింద ఏడాదిలో ఒక్క నెల పేదలకు వైద్యం చేస్తే ఆనందంగా ఉంటుందని ఏనెలలో పనిచేస్తారో మాకు చెప్తే ఏర్పాట్లు చేస్తాం అని ముఖ్యమంత్రి అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఏఐజీ నూతన ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్‌గా మారింది.
దేశంలో తయారయ్యే బల్క్‌డ్రగ్‌లో 35శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోందని అన్నారు. జినోమ్ వ్యాలీ హైదరాబాద్‌కు చాలా కీలకం. దాదాపు 66 దేశాల నుంచి వచ్చే పేషంట్‌లకు వైద్య సేవలందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం. ఏఐజీ ఆసుపత్రి సేవలు ఇంకా విస్తరించాలని సీఎం ఆక్షాంక్షించారు. తెలంగాణ హెల్త్ టూరిజంలో ప్రభుత్వానికి సహకరించాలని నాగేశ్వర్‌రెడ్డిని కోరామన్నారు. . జనని మిత్ర యాప్ పేదరోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్స్‌లో అదనపు బ్లాక్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్‌లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు భారంగా మారాయని అందుకే మేము అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి రిలీఫ్ ఫండ్ కింద రూ.1400 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో ఉన్నదని ముఖ్యమంత్రి తెలిపారు. వీరికి వ్యక్తిగతంగా యూనిక్ ఐడీతో గుర్తింపు కార్డు ఇచ్చి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందిస్తామని ఈ కార్డులో వారి కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తం చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-39-201090.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.