ముఖ్యమంత్రికి కోప మొచ్చింది .. ఎందుకో?

Publish Date:Jun 28, 2025

Advertisement

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు. ముఖ్యంగా సహచర మంత్రులపై గుస్సా అయిన సందర్భాలు అసలుకే లేవని చెప్పవచ్చును. మంత్రి వర్గ సమావేశాల్లోకానీ,  బయట ఇతరత్రా కార్యక్రమాల్లో  కానీ,మంత్రులు తనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని రేవంత్  రెడ్డి కోరుకున్నది కూడా లేదని అంటారు. 

నిజానికి, ముఖ్యమంత్రి అందరిలో ఒకడిలా కలిసిపోతున్నారని, హుందాతనం రావడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, నిజానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కిరీటాలు ఏమీ ఉండవు. మంత్రి వర్గంలో అందరూ సమానమే,అందులో ముఖ్యమంత్రిది మొదటి స్థానం,అంతే అంతకు మించి’ ముఖ్యమంత్రి మరో ప్రత్యేక ఏదీ ఉండదు. అయితే, అది సత్యమే అయినా వాస్తవం కాదు. వాస్తవంలో ముఖ్యమంత్రికి పెట్టని కిరీటంఉంటుంది,  ఆయన మాటే శాసనం అన్నట్లు. పరిపాలన నడుస్తుంది. కానే, రేవంత్ రెడ్డి మాత్రం, కారణాలు ఏమైనా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. 

అందరిలో ఒకరిగానే మెలుగుతున్నారు. అదలా ఉంచితే,  రేవంత్ రెడ్డి గడచిన 18 నెలల్లో ఎప్పుడు మంత్రులను మందలించిన సందర్భం లేదు, కానీ, ఈ మధ్య కాలంలో సీఎం స్వరంలో కొంత మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో   రేవంత్ రెడ్డి  మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వాటిపై దృష్టిపెట్టడం లేదని గుస్సా అయ్యారని, ఇలా అయితే, కుదరదని కొంచెం చాలా గట్టిగానేహెచ్చరించారని  సమాచారం.


అలాగే, మంత్రులకు డూస్’ అండ్’  డోంట్స్’, (ఏమి చేయాలి, ఏమి చేయకూడదు)కు సంబదించి కూడా దిశా నిర్దేశం చేశారని, అందులో భాగంగా,. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదేనని స్పష్టం చేసినట్లు చెపుతున్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవులు భర్తీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిజానికి, ఇక్కడ ముఖ్యమంత్రి ఏ ఒక్క మంత్రిని పేరు పెట్టి తప్పు పట్టలేదు.కానీ, ముఖ్యమత్రి, అందరినీ కాకుండా కొందరిని ఉద్దేశించి మాత్రమే, గుస్సా అయ్యారని, అందులో, రెవిన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యులని పార్టీ వర్గాల సమాచారంగా, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిజానికి, ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత మంత్రులలో పొంగులేటి పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, ఇదరి మధ్య దూరం పెరిగిందని అంటారు. నిజానికి, ఒక దశలో,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటిని, కీలక శాఖల నుంచి తప్పించే ఆలోచన చేశారని, ప్రచారం జరిగింది. అదొకటి అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి తొందరపడి చేసిన ప్రకటన విషయంలోనూ పొంగులేటిని పీసీసీ చీఫ్’ మందలించి నట్లు వార్తలొచ్చాయి. అంటే కాకుండా, ఇటీవల కాలంలో పొంగులేటి వ్యతిరేకంగా ఢిల్లీకి ఫిర్యాదులు చేరినట్లు ప్రచారం  జరిగింది. ఈ నేపధ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మూడు రోజుల క్రితం (బుధవారం) ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.

ఇప్పడు ఈ భేటీ వ్యహారం పార్టీ వర్గాల్లో, ముఖ్యంగా, కీలక నేతల స్థాయిలో  చర్చనీయాంశం అయిందని అంటున్నారు. అంతే కాదు, పొంగులేటి ఢిల్లీ ఎందుకు వెళ్ళారుఅనే విషయంలో, విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పొంగులేటిని అధిష్ఠానమే పిలిచిందా? లేదంటే, తనపై వస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌’ను కలిసి తనపై చేసిన ఆరోపణలకు సంబదించి వివరణ ఇచ్చేందుకు ఆయనే ఖేర్గేను కలిశారా, అనే విషయంలో క్లారిటీ లేదని అంటున్నారు. అయితే, అరిటాకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వెళ్లి అరిటాకు మీద పడినా చినిగి పోయేదే,  ఆకుకే నష్టం, అలాగే, ఈయన వెళ్లి ఆయన్ని కలిసినా ఆయనే ఈయన్ని పిలిపించినా,జరిగేది అదే అంటున్నారు. 

అయితే గంటకు పైగా జరిగినట్లు చెపుతున సమావేశంలో ఖర్గే, రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకెళ్లాలని పొంగులేటికి హితబోధ చేసినట్టు చెపుతున్నారు. అయితే ఢిల్లీ కోర్టుకు చేరిన పొంగులేటి పంచాయతీ’ ఇంతటితో ముగిసేది కాదని, ముందు ముందు కొత్త మలుపులు తిరిగినా,మరింతగా ముదిరిన ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఉక్కపోతను ఎక్కువ కాలం తట్టుకోవడం ఎవరికైనా కొంచెం చాలా కష్టం,సో.. పొంగులేటి వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు


 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.