కాంగ్రెస్‌ పార్టీలో వ్యతిరేకత ఎదుర్కొన్నా : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Feb 21, 2026

Advertisement

 

వికారాబాద్ జిల్లా అనంతగిరి హరితా రిసార్ట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా దేశ స్వాతంత్ర్యానికి ముందు పుట్టలేదని తెలిపారు. 141 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల భారత ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి దిశానిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన మరో పార్టీ సీపీఐ మాత్రమేనని పేర్కొన్నారు. ఏఐసీసీ చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

దేశ స్వాతంత్ర్యానికి ముందు 140 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్ర్యం, ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ఏర్పడిన కొన్ని పార్టీలు ఇప్పుడు “కాంగ్రెస్ ముక్త భారత్” అంటూ నినాదాలు చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. భారతదేశ ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, సమూలంగా మార్చాలని కుట్రలు జరుగుతున్న ఈ సమయంలో ఈ శిక్షణా కార్యక్రమం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. డీసీసీ అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.

వారసత్వంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ వైఎస్ షర్మిల అలా చేయలేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం జైలు శిక్షలు అనుభవించారని తెలిపారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయుల తూటాలకు ఆయనే బలయ్యారని గుర్తుచేశారు.
గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ త్యాగం చేసి కాంగ్రెస్‌కు అండగా నిలిచారని పేర్కొన్నారు. సౌకర్యంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ విజయాల్లో ప్రస్తావించాల్సినవని అన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ప్రస్తుతం ఏపీలో పార్టీ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాలకు అధిపతులమని భావించవద్దని సూచించారు. విభేదించిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి మద్దతు కోరానని గుర్తుచేశారు. కలిసికట్టుగా పనిచేసినందువల్లే 2.5 శాతం ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేసినట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షులుగా కృషి చేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చామని, అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు కల్పించామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను పార్టీ పరిశీలిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఎలాంటి కోటాలు లేవని, మెరిట్‌ కోటా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేయవద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యర్థి పార్టీలతో 2 శాతం తేడా ఉండగా, అది పార్లమెంట్ ఎన్నికల్లో 4 శాతానికి, మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగిందని వివరించారు. ఇది కార్యకర్తల శ్రమ, ప్రజల్లో ఉన్న నమ్మకం వల్ల సాధ్యమైందని చెప్పారు. దేశాన్ని, కాంగ్రెస్‌ను విడదీయలేమని, దేశ ఆత్మనే కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెట్టి అవమానిస్తున్నారని విమర్శించారు. మూడు తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బుల అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, పేదల గొంతును నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన చేపట్టామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు గెలిచారని, మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం ఓబీసీలు ఎన్నికయ్యారని వివరించారు. ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని అన్నారు. పైరవీలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే నాయకుల గౌరవం పెరుగుతుందని సూచించారు. తాను ఎప్పుడూ పైరవీల కోసం పనిచేయలేదని తెలిపారు. 16 ఏళ్లలో జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు అడుగడుగునా కాంగ్రెస్ తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.