రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి..ప్రధానికి రేవంత్‌ విజ్ఞప్తి

Publish Date:Jun 11, 2026

Advertisement

 

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని వివరించారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌–2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని కూడా ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఫేజ్‌–2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ₹38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు.

హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, ఎన్‌హెచ్‌ఏఐకి ₹626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ట్రిపుల్‌ ఆర్‌లో దక్షిణ భాగం నిర్మాణం కూడా అంతే కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ మ్యాపులు, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌–అమరావతి–బందర్‌ పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు  కేంద్రం అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్టును కలిపే 12 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని చెప్పారు.

 120 మీటర్ల రైట్‌ ఆఫ్‌ వే తో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్‌ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందని తెలిపారు.

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులను ప్రారంభించాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తిచేసి ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత లబ్ది చేకూరుతుందని అన్నారు. 

 హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్‌, టీఐఎఫ్‌ఆర్‌ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయని, ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుందని ప్రస్తావించారు.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.