తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్

Publish Date:May 19, 2020

Advertisement

తెలంగాణలో కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా చోట్ల అన్ని దుకాణాలను తెరుచుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, రాత్రి 7 గంటల వరకే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అయితే, తెలంగాణ బస్సులు వేరే రాష్ట్రానికి వెళ్లబోవని, ఇతర రాష్ట్రాల బస్సులను తెలంగాణకు రానివ్వబోమని చెప్పారు. 

హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఉన్నందున సిటీ బస్సులు నడపడం లేదని ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్ కూడా‌ బంద్‌ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయం తీసుకొని హైదరాబాద్‌లోని నిబంధనలు ప్రకటిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లో సరి బేసి విధానంలో సగం దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పారు. 

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ తెరవడానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. మొత్తం సిబ్బంది విధులకు హాజరు కావచ్చన్నారు. అయితే, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ-కామర్స్‌కు ఆంక్షలు లేకుండా వంద శాతం అనుమతి ఇస్తున్నట్లు సీఎం తెలిపారు.

ప్రతీ ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని.. లేకుంటే, రూ.1000 జరిమానా తప్పదని సీఎం హెచ్చరించారు. భౌతికదూరం కూడా తప్పనిసరి పాటించాలన్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించిందని అవసరం ఉన్న వారు లేనివారు రోడ్ల మీదకు రావొద్దని.. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడం ఉత్తమమని సీఎం చెప్పారు. కరోనా మళ్లీ తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.