హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్?

Publish Date:Sep 3, 2021

Advertisement

రాష్ట్రం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణం చల్లబడింది. అయితే హుజూరాబాద్ నియోజక వర్గంలో మాత్రం ఎన్నికల వేడి భగ్గుమంటోంది. మండు వేసవిని మరిపిస్తోంది. రోజులు గడించే కొద్ది వేడి మరింతగా పెరుగుతోంది, మాటలు గీత దాటుతున్నాయి. రాష్ట్రంలో ఇంతలా రాజకీయ వేడిన రాజేసిన హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇప్పటికే, ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితితో పాటుగా ఎన్నికల నిర్వహరణ ఏర్పాట్లు, సంసిద్ధత అడిగి తెలుసుకుంది. 

గత నెలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కరోనా కారణంగా చూపించి, ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి  లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపిన తెరాస ప్రభుత్వం బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  మాత్రం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. దీంతో ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడన్న ఉత్కంఠకు తెరపడినట్లే అంటున్నారు.  రోజుల్లోనే ముహూర్తం ఖరారు కావడం, షెడ్యూలు విడుదల ఖాయమని అంటున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ ఏడాది జూన్‌లో రాజీనామా చేయటంతో ఖాళీ అయిన స్థానానానికి  నిబంధనల మేరకు ఈ ఏడాది డిసెంబరు 12 లోగా   ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే, పొరుగు రాష్ట్రం ఏపేలోని బుద్వేల్ శాసనసభ నియోజకవర్గం సిట్టింగ్  శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన స్థానానికి, సెప్టెంబర్ 28 లోగా ఉపఎన్నిక జరగవలసివున్ననేపధ్యంలో సెప్టెంబర్’లోనే ఉపఎన్నిక జరుగుతుందని లేదంటే, అక్టోబర్, నవంబర్ మాసాలలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే ఉప ఎన్నిక ముహూర్తం ఖరారయ్యే పక్షంలో ఈవారంలోనే  షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. 

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా, చాలా పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు బరిలో నిలిచే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే, తమకు జరుగతున్న అన్యాయయానికి నిరసనగా, వివిద సంఘాలు తమ ప్రతినిధులను పెద్ద సంఖ్యలో బరిలో దించుతున్నట్లు ప్రకటించాయి.మరో వంక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చేస్తే ఆర్థిక సహాయం చేస్తామంటూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. గత (2018) ఎన్నికల్లో మొత్తం పది మంది సభ్యులు మాత్రమే పోటీ చేశారు. అయితే ఈ సారి ఈ సంఖ్య ఎందాకా పోతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఒక వేళ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల సంఖ్య 384 దాటితే, ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ ఉపయోగించక తప్పదని అధికారులు అంటున్నారు. గతంలో 1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 477 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో 50 పేజీల బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించి పోలింగు నిర్వహించారు. 2019లో నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో ఎం3 రకం ఈవీఎంలతో పోలింగు నిర్వహించారు.తొలిసారిగా ఆ అత్యాధునిక ఈవీఎంలను నిజామాబాద్‌లోనే వినియోగించటం విశేషం. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈవీఎంలా? బ్యాలెట్‌ బాక్సులా? ఏ పద్దతిలో జరుగుతుంది అనేది,  నామినేషన్ల ఉపసంహరణ తరవాతనే  తెలుస్తుంది. 

నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. బీజేపీ తమ అభ్యర్ధిని ఇంకా అధికారకంగా ప్రకటించక పోయినా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఆయనకు పోటీగా మాజీ మిత్రుడు, మంత్రివర్గ సహచరుడు, ఈ అన్నిటినీ మించి  సహా బాదితుడు మంత్రి హరీష్ రావు, తెరాస  అభ్యర్ధి గెల్లు శ్రీనివాస యాదవ్ విజయం కోసం సర్వతానై ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు .. కారణాలు ఏవైనా ప్రచారంలోనూ పెద్దగా శ్రద్ద  చూపడం లేదు. ఎన్నికల కమిషన్ ముహూర్తం ఖరారు చేసిన తర్వాతగానీ, కాంగ్రెస్ వ్యూహం ఏమిటన్నది తెలియదు. అది తెలిస్తే ప్రధాన పోటీ ద్విముఖమా ? త్రిముఖమా అన్నది తేలదు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.