అక్కడ అలా... ఇక్కడ ఇలా.. ఎందుకిలా?

Publish Date:Nov 13, 2021

Advertisement

అధికారం అందుకోనంత వరకు అన్నాచెల్లెళ్లు ఒక్కటే. పైసలు సంపాదించనంత వరకు అన్నాచెల్లెళ్లు ఒక్కటే.. అధికారం అందుకోన్న తర్వాత ? పైసలు సంపాదించిన తర్వాత? అన్న చెల్లెళ్ల మధ్య ఉన్న బంధం బంద్ అవుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంల ఫ్యామిలీ వ్యవహారాన్నే వారు సోదాహరణగా చెబుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నంత వరకు ఆయన తన సోదరి వైయస్ షర్మిలతో మంచి అనుబంధమే ఉంది. వైయస్ జగన్ .. 16 మాసాలు జైలులో ఉండగా.. జగనన్న వదిలిన బాణం అంటూ వైయస్ షర్మిల .. పాదయాత్ర చేపట్టి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేశారు. అంతేకాదు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమె సోదరుడు వైయస్ జగన్‌ను గెలిపించుకునేందుకు షర్మిల ఎంతగానో ప్రచారం చేయాలో అంతగా ప్రచారం చేశారు. 

చంద్రబాబుకు బై బై.. అంటూ జగనన్న గెలుపు కోసం షర్మిల చేసిన ప్రచారం అంతా ఇంతా కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత.. జగనన్న, వైయస్ షర్మిల మధ్య గాప్ బాగా పెరిగింది. దీంతో షర్మిల పక్క రాష్ట్రం తెలంగాణ వచ్చి వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే.. సోదరి షర్మిలకు పదవి ఇస్తానని చెప్పిన జగనన్న ఆ తర్వాత మాట తప్పి మడం తిప్పారని..  దీంతో షర్మిల అలక బూనారని..  ఆ తర్వాత ఆమె మెట్టినింట వైయస్ఆర్ టీపీ పేరిట పార్టీ పెట్టారనే ప్రచారం తాడేపల్లిలో అయితే జోరుగా సాగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరో పక్క తెలంగాణలో సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితమ్మ మధ్య కూడా చాలా గ్యాప్ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితమ్మ కూడా చాలా పోరాటం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ అన్నా చెల్లెలు మధ్య అనుబంధం బతుకమ్మ పండగలా కళకళలాడింది. 

అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ అన్నా చెల్లెల మధ్య గ్యాప్ చాలా బాగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ సీఎంగా ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలతోపాటు  ముఖ్యమంత్రి పీఠాన్ని తన కుమారుడు కేటీఆర్‌కు కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. ఆ క్రమంలోనే దాదాపు రెండు దశాబ్దాలు అనుబంధం ఉన్న ఈటలను సైతం తన కారులో నుంచి సీఎం కేసీఆర్ దింపేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇదే అంశంలో తన కుమార్తె కవితను సైతం కేసీఆర్ పక్కన పెట్టారనే టాక్ కారు పార్టీలో వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది కేటీఆర్‌తో కవిత ఎంతో అట్టహాసంగా జరుపుకునే రాఖీ పండగను ఈ ఏడాది కవితమ్మ చెక్ పెట్టిందనే వార్తలు గుప్పుమన్నాయి. 

 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కవిత ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత ఆమెకు పదవి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్.. ఇంటి ఆడబడుచు అయిన కవితమ్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఈ పదవి కూడా వచ్చే జనవరి 4వ తేదీతో ముగియనుంది. దాంతో ఆమెకు మళ్లీ ఏ పదవి లేకుండా పోతుంది. తనకు మళ్లీ పదవి కట్టబెట్టాలని సీఎం కేసీఆర్‌ వద్ద కవితమ్మ తెగ పోరు పెడుతున్నట్లు సమాచారం. 

టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించింది. అయితే ఈ సభలో ఎక్కడ కవిత ఫోటో లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. కవితమ్మ హైదరాబాద్‌లో ఉండి మరీ ఈ ప్లీనరీకి డుమ్మా కొట్టిడంతో కేసీఆర్ ఫ్యామీలీలో గ్యాప్ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

అంతేకాదు దీనిపై సోషల్ మీడియా సాక్షిగా కల్వకుంట్ల తారకరాముడు, కవితమ్మ మధ్య గ్యాప్ మాములుగా లేదంటూ కారు పార్టీలో కూతలు మొదలైనాయి. ఏదీ ఏమైనా.. ఇటు ఆంధ్రలో అటు తెలంగాణలో గద్దెనెక్కిన పార్టీ అధినేత ఫ్యామిలీలలోని అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్‌లు బాగా పెరిగాయని దీనిని బట్టే అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.