కర్నాటకం.. సీఎం మార్పు ఖాయమేనా?

Publish Date:May 26, 2026

Advertisement

కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికైనా కష్టమే. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి పీఠం చుట్టూ తిరుగుతున్న అంతర్గత రాజకీయాలు ఇప్పుడు  కీలక మలుపు తిరిగాయి. కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు  ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. పార్టీ హైకమాండ్ మధ్యవర్తిత్వంతో రెండున్నరేళ్ల రొటేషనల్ పవర్ షేరింగ్   ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే సిద్ధరామయ్యకు మొదట అవకాశం ఇచ్చారని డీకే శివకుమార్ అనుచరులు గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించాలనే డిమాండ్ జోరందుకుంది. 

డీకే శివకుమార్ పార్టీ కోసం చేసిన కష్టాన్ని, ఆయనకున్న వ్యూహాత్మక చతురతను కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు ప్రముఖులు బలంగా సమర్థిస్తున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఇద్దరూ డీకే శివకుమార్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పోషించిన పాత్ర చాలా ముఖ్యమనీ,  ఒడుదొడుకులు ఎదురైన ప్రతిసారీ పార్టీని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఆదుకున్న ట్రబుల్ షూటర్ ఆయనేనీ అంటున్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్‌కు రూ. 1,413.80 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2018లో ఈ ఆస్తుల విలువ రూ. 840.01 కోట్లుగా ఉండగా, అది ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఇందులో రూ. 1,140.38 కోట్ల స్థిరాస్తులు, రూ. 273.41 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అలాగే ఆయనకు రూ. 265.06 కోట్ల అప్పులు, ఏడాదికి రూ. 14.4 కోట్ల వార్షిక ఆదాయం ఉంది. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా దాదాపు 19 కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన పార్టీ లైన్‌ను దాటకుండా నమ్మకంగా నిలబడ్డారు. అందుకే ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, సీఎం కుర్చీ ఆయనకే ఇవ్వాలని ప్రియాంకా గాంధీ గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

అయితే, ఈ అధికార మార్పిడి అంత సులభంగా సాగేలా కనిపించడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన ఓబీసీ నాయకుడు కావడంతో..  ఆయనను అకస్మాత్తుగా పదవి నుంచి తప్పిస్తే పార్టీ ఇమేజ్‌కు భంగం కలుగుతుందేమోనని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఒక సరికొత్త వ్యూహాన్ని అధిష్టానం పరిశీలిస్తోందంటున్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలి రాజ్యసభకు వెళ్లిన తరహాలోనే, కర్ణాటకలోనూ అధికార బదిలీ ఫార్ములాను అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకులు భావిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం తన స్థానంలో డీకే శివకుమార్ రావడాన్ని అంతగా ఇష్టపడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

కర్ణాటకలోని బొక్కలిగ సామాజిక వర్గంలో డీకే శివకుమార్‌కు ఉన్న పట్టు, బూత్ స్థాయి కార్మికులను నడిపించే నైపుణ్యం పార్టీకి శ్రీరామరక్ష అని ప్రియాంక వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఎలాంటి అస్థిరత రాకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్  ఓపిక ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది  అని వ్యాఖ్యానించడం విశేషం. ప్రియాంకా గాంధీ అండతో డీకే శివకుమార్ అనుకున్నది సాధిస్తారా, లేదా సిద్ధరామయ్య తన పీఠాన్ని కాపాడుకుంటారా  అన్న చర్చ కర్నాటక రాజకీయాలలో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.