అవకాశాలకు నెలవు అమరావతి...సరికొత్త ఆలోచనలతో రావాలి : సీఎం చంద్రబాబు

Publish Date:Jun 16, 2026

Advertisement

 

సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం..

అంతర్జాతీయ మౌలిక వసతులతో నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరికొత్త ఆలోచనలతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సింగపూర్‌లో రెండవ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’‌ లీడర్ షిప్ ప్లీనరీ-2లో పాల్గొని ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశపై ప్రసంగించారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని... జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు వస్తున్నాయని సీఎం చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి అమరావతికి ప్రత్యేకత తీసుకువస్తాయని వివరించారు. 

అమరావతిని ప్రజా రాజధానిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మితమవుతోందని స్పష్టం చేశారు. ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందన్నారు. 21 కి.మీ. కృష్ణానది పొడవునా వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని..., అలాగే ఇన్నర్ - ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా నిలుస్తుందని చెప్పారు. స్పోర్ట్స్, ఫైనాన్సియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి థీమ్ లతో అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. 

ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ఒకే ఒక్క పిలుపుతో రాజధాని నిర్మాణం కోసం రైతులు 35 వేల ఎకరాలను అప్పగిస్తే... వాటిని అభివృద్ధి చేసి కొంత భాగాన్ని రైతులకు తిరిగి ప్లాట్లుగా ఇచ్చామని వివరించారు. 25 ఏళ్ల క్రితం తాను ఐటీ గురించి మాట్లాడానని... ఐటీ భవిష్యత్‌ను ఆరోజే ఊహించి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌ తీసుకోవడంతో... ఇవాళ తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో అందరికన్నా ముందున్నారని సీఎం అన్నారు. ఇప్పుడు ఏఐ గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. నాడు తాను నిర్మించిన సైబరాబాద్... నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. 

సైబరాబాద్‌లో నాడు ఎకరం రూ.2 లక్షలు ఉంటే... నేడు ఎకరం రూ.200 కోట్లకు పెరిగిందన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందని చెప్పేందుకు సైబరాబాద్ నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో మరోసారి కొత్త నగరాన్ని నిర్మించే అవకాశం తనకు లభించిందన్నారు. ప్రసంగం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సింగపూర్‌ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించారు. సింగపూర్ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పట్టణాభివృద్ధి నమూనాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. ఇన్నోవేటర్స్ అలేలో స్టార్టప్‌ల ఆవిష్కరణలను, గూగుల్ స్టాల్‌ను పరిశీలించారు. టెక్నాలజీ ఆధారిత పాలనలో సింగపూర్ అనుభవాలను తెలుసుకున్నారు.


 

By
en-us Political News

  
మానవ సంబంధాలు ఎంతలా మంటగలిసిపోతున్నాయో చెప్పడానికి కాకినాడ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ.
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ లో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.
రేపు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి...
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
మెట్రో ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు
తెలంగాణలో హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీజీ 20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెల్‌లో ఏపీదే పేటెంట్..
రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2026 ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆలయ అధికారులు ఖరారు చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది.
హనీమూన్ ప్రయాణం అంటే సరికొత్త జీవితానికి అందమైన పునాది.
దేశ రక్షణలో కీలకమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారిక విధుల్లో బిజీగా ఉండే ఒక ఉన్నతాధికారి కుటుంబంలో నమ్మశక్యం కాని ఘోరం వెలుగుచూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.