ఆయిల్ కంపెనీల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్.. సరఫరా పునరుద్ధరించకుంటే చర్యలు తప్పవంటూ వార్నింగ్

Publish Date:Apr 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. ప్రజలకు అత్యవసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగడం పట్ల  అసహనం వ్యక్తం చేసిన ఆయన సోమవారం (ఏప్రిల్ 27) నాటికి రాష్ట్రంలోని ఏ ఒక్క పెట్రోల్ బంకు వద్ద కూడా  నో స్టాక్ అనే బోర్డు కనిపించడానికి వీల్లేదని చమురు కంపెనీల ప్రతినిధులకు   అల్టిమేటం జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సదరు కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి  చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి  ఉన్నతాధికారులు,  ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం (ఏప్రిల్ 26)  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు. రిటైల్ అవుట్‌లెట్లకు ఇవ్వాల్సిన క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేసి..  సరఫరాను ఆపడం వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ధోరణిని సహించేది లేదన్నారు.

రాష్ట్రంలో ముఖ్యంగా నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా  నిలిపివేయడం వల్లే సమస్య జటిలమైందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోతల సీజన్ నడుస్తుండటం, వ్యవసాయ,  ఆక్వా రంగాల నుండి డీజిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమైందన్నారు.  మూడు రోజుల క్రితమే ఈ సమస్య వెలుగులోకి వచ్చినా,  తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను సీఎం నిలదీశారు. తనకు కేవలం నివేదికలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలని స్పష్టం చేశారు.

ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందన్న చంద్రబాబు. .   ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్,  కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన నిఘా ఉంచాలని పోలీసు, పౌర సరఫరాల శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమయ్యే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనీ.. అవసరమైతే కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో చమురు కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనీ.. డిపోల నుండి బంకులకు ఇంధనాన్ని తరలించే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ సోమవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది. వేసవి,  వ్యవసాయ పనుల నేపథ్యంలో ఇంధన అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించడం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కృత్రిమ కొరతలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని సీఎం అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.  

By
en-us Political News

  
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.