ఆక్వా రంగంలో ఏపీ నెంబర్ 1 : సీఎం చంద్రబాబు

Publish Date:Jun 5, 2026

Advertisement

 

దేశంలోని మొత్తం మత్స్య సంపదలో 28 శాతం ఒక్క ఏపీ నుంచే వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీ-ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత పదేళ్లలో ఈ రంగంలో 5 శాతం నుంచి 70 శాతం పెరుగుదల కనిపిందని చెప్పారు.

భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని, భారత బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ సీ-ఫుడ్ ఎగుమతుల వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, రాష్ట్ర ఆక్వా రంగ అభివృద్ధికి సంబంధించిన దార్శనికతను, భవిష్యత్ కార్యాచరణను వివరించారు.

భారతదేశంలో చేపల ఉత్పత్తి, రొయ్యల ఉత్పత్తి, సముద్ర ఆహార ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందని చంద్రబాబు వెల్లడించారు. దేశ మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం కాగా, రొయ్యల ఉత్పత్తిలో 66 శాతం రాష్ట్రానిదేనని తెలిపారు. అలాగే దేశ సముద్ర ఆహార ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 38 శాతం, అంటే సుమారు రూ.28 వేల కోట్లకు పైగా ఏపీ నుంచే సమకూరుతోందన్నారు.

ప్రపంచ సీ-ఫుడ్ వ్యాపారంలో భారత్ వాటా ప్రస్తుతం కేవలం 5 శాతమేనని, దీనిని మరింత పెంచుకునే అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశ ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఆక్వా రంగ సమగ్రాభివృద్ధి కోసం అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ‘ఆక్వా కారిడార్’ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ కారిడార్‌లో పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఆధునిక సాంకేతికతతో కూడిన సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అత్యల్ప వ్యయంతో అత్యధిక ఉత్పత్తి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, “పాండ్ టు పోర్ట్ – ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్” విధానంతో ముందుకు సాగుతామని చెప్పారు. ‘ఆంధ్రా రొయ్య – ఇండియా సీ-ఫుడ్’ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో కేటాయిస్తామని వెల్లడించారు. కాకినాడ పోర్టు ఆధునికీకరణకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇచ్చిన హామీపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు, మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందని గుర్తుచేశారు.
 

By
en-us Political News

  
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.