చెత్త నుంచి సంపద సృష్టించొచ్చు : సీఎం చంద్రబాబు

Publish Date:Aug 23, 2025

Advertisement

 

పేదలపై పన్ను భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను చంద్రబాబు పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికుల వివరించారు.  

గత వైసీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా విస్మరించిందని, కలుషిత నీటితో ప్రజలు రోగాల బారిన పడ్డారని ఆయన అన్నారు. స్వచ్చమైన నీరు, పరిశుభ్రమైన వాతవరణం కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్ను విధానంపై కీలక వ్యాఖ్యలు. జగన్ హయాంలో చెత్తకు పన్ను వేశారని, కానీ తీయలేదని ఎద్దేవా చేశారు అన్ని మున్సిపాలిటీల్లోని చెత్తా చెదారాన్ని అక్టోబర్ 2 నాటికి తొలగిస్తామని సీఎం  స్పష్టం చేశారు.

 ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదని, చెత్తతో కూడా సంపద సృష్టించొచ్చని చెప్పారు. ప్రజల ఆలోచనా విధానం మారాలని అప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సంపద సృష్టించడం.. ఆదాయాన్ని పెంచడం మాకు తెలుసు. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగదు. నేను సూపర్‌ సిక్స్‌ అంటే సాధ్యం కాదన్నారు.. చేసి చూపించామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని పేర్కొన్నారు.పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమరావతికి నిధులు ఇవ్వొద్దని అందరికీ లేఖలు రాశారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా అమరావతిని తయారు చేస్తామన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతిని మహానగరాలుగా మారుస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ఎవరైనా ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.