సీఎం చంద్రబాబు చేసే మొదటి మూడు సంతకాలు ఇవే!

Publish Date:Jun 13, 2024

Advertisement

నారా చంద్రబాబునాయుడు అనే నేను.. అంటే ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి రాష్ట్రంలో అభివృద్ధి వేవ్స్ కనిపిస్తున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఐదేళ్ల నరకాసుర పాలన అంతమైందన్న ఆనందం సర్వత్రా కనిపిస్తోంది.  జగన్ పాలనలో  రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ఇబ్బందులకు గురయ్యారు. సమస్యలు పరిష్కారం కావడం అటుంచి.. అవి పెచ్చరిల్లి నానా యాతనలూ పడ్డారు. సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే స్వేచ్ఛ సైతం లేకండా పేదవాడి ఆగ్రహం పెదవికి చేటు అన్న చందంగా తమ ఆగ్రహజ్వాలలు బయటకి కనిపించకుండా మౌనాన్నాశ్రయించారు. రాష్ట్రం ఇప్పుడు జగన్ బందిఖానా నుంచి విముక్తి పొందింది. ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేసే చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వాగ్దానాలను వరుస క్రమంలో నెరవేరుస్తారన్న విశ్వాసంతో పాటు.. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా దౌడుతీస్తాయన్ నమ్మకం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యలోనే ఆయన సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేసే ఫైళ్లు ఏమిటి అన్నదానిపైనే అందరి ఆసక్తీ నెలకొని ఉంది. 

అందుకు తగ్గట్టుగానే బుధవారం (జూన్ 12) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తన కేబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. ఆ భేటీలో తన ప్రాధాన్యతలు, ప్రాధమ్యాల గురించి వారికి విశదీకరించారు. ఆ తరువాత ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గురువారం (జూన్ 13)న ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారు.

అది కాకుండా ఆయన మరో రెండు దస్త్రాలపై కూడా సంతకం చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. అవేమిటంటే.. జగన్ సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఆయన తన రెండు సంతకం చేస్తారని చెబుతున్నారు. అదే విధంగా సామాజిక పెన్షన్ల ను  నాలుగు వేల రూపాయలకు పెంచే ఫైలుపై మూడో సంతకం చేస్తారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.