సోషల్ మీడియా సంస్థలపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు.. వైసీపీలో కలవరం? 

Publish Date:Sep 3, 2021

Advertisement

దేశంలో సోషల్ మీడియా అరాచక శక్తులకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇది మరింతగా శృతి మించింది. ఏకంగా న్యాయమూర్తులనే టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైసీపీ నేతలు అసహనానికి గురై…కోర్టులు, జడ్జిలపై నేరుగానే విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోవడంతో  వైసీపీ నేతలపై పలు న్యాయస్థానాలు సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు కూడా జారీ  అయ్యాయి.  ఆ 49 మందిలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు. 

తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల తీరుపై  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చెప్పినా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శక్తివంతమైన వ్యక్తులు చెబితే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. 

జవాబుదారీతనం, సరైన నియంత్రణ లేకపోవడంతో వ్యక్తుల పరువుకు నష్టం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ఇది, దేశానికి ఎంతో ప్రమాదకరమని, ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో అలజడులకు ఇదే కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పుకునే ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా అని, మంచికి వాడితే అదో మంచి ఆయుధమని, కొందరు దానిని దుర్వినియోగపరుస్తూ సమాజంలో చిచ్చు పెడుతున్నారని అభిప్రాయపడ్డారు.దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తికి తబ్లిగ్ జమాత్ సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశానికే ప్రమాదకరమని జస్టిస్ ఎన్వీ రమణ హెచ్చరించారు.

సోషల్ మీడియా కేసులకు సంబంధించిన వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాత లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు. సోషల్ మీడియా సంస్థలపై  సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి .ఆంధ్రప్రదేశ్ లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.