Publish Date:Jan 25, 2022
అశోక్ బాబు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ. గతంలో ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమంలో ముందు వరసలో నిలబడ్డారు. గతంలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ( ఏసీటీఓ)గా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ వాయిస్ ను పలు వేదికలపై సమర్థంగా వినిపిస్తున్న నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు అశోక్ బాబు.
అయితే.. అశోక్ బాబుపైన ఇప్పుడు కేంద్రం ఆధీనంలో పనిచేసే సీఐడీ విభాగం కేసు నమోదు చేయడం వార్తల్లోకి ఎక్కింది. ఆయనపై సెక్షన్ 477A,465,420 కింద సీఐడీకేసు నమోదు చేసింది. అశోక్ బాబు గతంలో ఏసీటీఓగా పనిచేసే సమయంలో బీకాం చదవక పోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చారనేది సీఐడీ మోపిన అభియోగం. తన సర్వీసు రికార్డు లేకుండానే అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణ వచ్చింది. రికార్డులు ట్యాంపరింగ్ చేసిన అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై గత ఏడాది లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
దీంతో స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త 2021 ఆగస్టులో అశోక్ బాబు కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అశోక్ బాబు విషయంలో తీసుకున్న చర్యల గురించి తమ దృష్టికి తీసుకురావాలని లోకాయుక్త తన ఆర్డర్లో పేర్కొంది.
అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు. బీకాం చదవకపోయినా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే అభియోగంపై అశోక్ బాబుపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికల అఫిడవిట్ లో కూడా గ్రాడ్యుయేట్ అని పేర్కొన్నారనే అభియోగం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పనిచేసి, రిటైరైన అశోక్ బాబుపై ఇప్పుడు కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైరైన తర్వాత టీడీపీలో చేరిన అశోక్ బాబు ఏ అంశంపైనైనా జగన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడుతూనే ఉంటారు. అలాంటి అశోక్ బాబుపై ఇన్నేళ్ల తర్వాత సీఐడీ కేసు నమోదు చేయడమేంటని అంటున్నారు. అకోశ్ బాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన మెహర్ కుమార్ వెనుక ఏ శక్తులు ఉన్నాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అశోక్ బాబు నిజంగా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉంటే ఎందుకు అప్పుడే చర్యలు తీసుకోలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడెందుకు అశోక్ బాబును టార్గెట్ చేశారనే సమాధానం అందని ప్రశ్న. టీడీపీ నేతలు ఒక్కొక్కరిని కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో వేధిస్తున్న వైసీపీ సర్కార్ కు అశోక్ బాబుపై కేసుల విషయంలో ఏమైనా ప్రమేయం ఉండి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cid-booked-a-case-on-tdp-mlc-ashok-babu-39-130727.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.