సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసులో విచారణ.. దర్యాప్తులో కీలక విషయాలు..!
Publish Date:Jul 30, 2026
Advertisement
నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపండి అంటూ బాధితురాలి విజ్ఞప్తి..! హైదరాబాద్లో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు, ఫిర్యాదులు తెరపైకి రావడంతో పోలీసులు దృష్టి సారించారు. ఇందు లో భాగంగానే జూబ్లీహిల్స్ డీసీపీ సీఐ శ్రీనివాసులు రెడ్డిని విచారించారు. మరోవైపు తనపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు ఉన్నతా ధికారులను ఆశ్రయించారు. తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆధారాలను కూడా అధికారుల ముందు ఉంచినట్లు ఆమె వెల్లడిం చారు. “నాకు న్యాయం చేయండి.. నాపై జరుగు తున్న ప్రచారాన్ని ఆపండి” అంటూ బాధితురాలు ఉన్నతాధికారుల ముందు తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తనపై తప్పుడు ఆరోప ణలు చేస్తూ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా సీఐ శ్రీనివాసులు రెడ్డికి మద్దతుగా కొంతమంది పోలీసు అధికారులే తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, తనకు సంబంధించిన విషయాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ప్రచారాల వెనుక ఎవరున్నారు? ఎందుకు తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారు? అనే కోణంలోనూ విచారణ జర పాలని ఆమె కోరింది. అంతేకాకుండా సీఐ శ్రీనివాసులు రెడ్డి బెదిరింపుల కారణంగా తాను లక్షల రూపాయలు చెల్లించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. తాను చేసిన ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించి, తన వద్ద ఉన్న ఆధారా లను విచారణలో భాగంగా పరిగణనలోకి తీసుకో వాలని ఆమె కోరింది.తన గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నా యంటూ అధికారుల ముందు బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తనపై వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక సీఐ శ్రీనివాసులు రెడ్డిపై చేసిన ఆరోపణలు, బాధితురాలు సమర్పిం చినట్లు చెబుతున్న ఆధారాలు, ఆమెపై జరుగుతున్నట్లు పేర్కొన్న నెగిటివ్ ప్రచారం.. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు లోతుగా దృష్టి సారించినట్లు సమాచారం. ఆరోపణల్లో వాస్తవం ఎంత? బాధితురాలు సమర్పించిన ఆధారాలు ఏ మేరకు నిజం? ఆమెపై ప్రచారం వెనుక ఎవరు న్నారు? అనే అంశాలపై విచారణ కొనసాగుతు న్నట్లు తెలుస్తోంది. తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే సీఐ శ్రీనివా సులు రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఉన్నతా ధికారులను కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసు శాఖలో విచారణ కొనసాగుతుండటంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ఆడియో లీక్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశారని బాధితురాలు ఆరోపించారు.అనంతరం రహస్యంగా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి, వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గర్భం దాల్చిన తర్వాత బెదిరించి అబార్షన్ చేయించారని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసు శాఖ విచారణ కొనసాగుతోంది. కేసులో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. CI Srinivasulu Reddy, Jubilee Hills CI, Jubilee Hills Police Station, Hyderabad Police,
Hyderabad Crime News, Telangana Police, CI Suspension, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy
http://www.teluguone.com/news/content/ci-srinivasulu-reddy-36-227556.html





